రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా పని చేయాలి

నవతెలంగాణా- ముత్తారం: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని కాంగ్రెస్‌ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం, మాజీ మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీ, జిల్లా ఎస్సీ మాజీ ఉపాధ్యక్షులు మద్దెల రాజయ్య నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ముత్తారం మండల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో క్లాస్టర్‌ కమిటీల కోసం సన్నాహక సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్ణాటక తరహాలో 3 వేలకు ఒక క్లస్టర్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రతీ కార్యకర్త గ్రామాల్లో ప్రచారం చేయాలని సూచించారు. ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు ఎలాంటి విభేదాలు లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. పార్టీలో ప్రతి కార్యకర్త నాయకుడు క్రమశిక్షణతో పనిచేయాలని అలాగే కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఫలితం ఉంటదని అన్నారు. పార్టీలో కుల విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి  రాగానే పదింతలు అభివఅద్ధి జరుగుతుందని అన్నారు. యూత్‌ కాంగ్రెస్‌ వారు కాంగ్రెస్‌ పార్టీ కి వెన్నెముక లాగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముత్తారం మండలం యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు బియ్యని శివకుమార్‌, కిసాన్‌ సెల్‌ మండల అధ్యక్షులు గాదం శ్రీనివాస్‌, బీసీ సెల్‌ మండల అధ్యక్షులు అల్లం కుమారస్వామి, ముత్తారం మండల సోషల్‌ మీడియా ఇన్ఛార్జ్‌ కోల విజయ్‌, కాంగ్రెస్‌ పార్టీ వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు పాల్గన్నారు
Spread the love