టియులో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపిన కాంట్రాక్ట్ అధ్యాపకులు..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కళాశాల ఎదుట బుధవారం మోకాళ్లపై కూర్చుని తమను రెగ్యులరైజ్ చేయాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జాక్ కో కన్వీనర్ డాక్టర్ వి దత్త హరి మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్ లను రెగ్యులరైజ్ చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ యూనివర్సిటీ పట్ల నిర్లక్ష్య వైఖరి తగదన్నారు. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ అన్ని అర్హతలు ఉన్నా, మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయాలని మోకాలుపై కూర్చొని ముఖ్యమంత్రికి మొరపెట్టుకుంటున్న స్పందించడం లేదని అయన వాపోయారు. గత 20 రోజులుగా వివిధ రకాలుగా ఆందోళన చేస్తున్న ముఖ్యమంత్రి నేటి వరకు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంతమైన విద్యావిధానం ద్వారా విద్యాబోధన చేస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేసి ఆదుకోవాలని ముఖ్యమంత్రి నేటి వేడుకున్నరు. ఈ కార్యక్రమంలో జాక్ కో- కన్వీనర్ గంగ కిషన్, కిరణ్ రాథోడ్, సిహెచ్ శ్రీనివాస్, నాగేశ్వరరావు, డాక్టర్ దేవరాజ్ శ్రీనివాస్, జలంధర్, గోపి, రాజ్ శరత్, నాగేంద్రబాబు, సురేష్ ,నాగేశ్వరరావు, జోష్ణ, అపర్ణ, సౌమ్యలు పాల్గొన్నారు. పార్ట్ టైం లెక్చరర్స్ పాల్గొని తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గురువారం నుండి కాంట్రాక్ట్ లెక్చరర్లు తమతో కలిసి పని చేస్తామని అందరి లక్ష్యం రెగ్యులరైజ్ ఉందని పేర్కొన్నారు.

Spread the love