నవతెలంగాణ-తుంగతుర్తి
అంబేద్కర్ భవనాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, వాటిని నిలబెట్టుకోవడం సామాజిక బాధ్యత అని తుంగతుర్తి సర్పంచ్ మల్లెపాక సాయిబాబా అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ సహకారంతో అంబేద్కర్ భవన్లో మంచినీటి సౌకర్యం కోసం బోరు వేయించి మాట్లాడారు. ఈ మేరకు నిరుపయోగంగా ఉన్న అంబేద్కర్ భవనంలో ఇటీవల కాలంలో కరెంటు ఏర్పాటు చేయడం జరిగిందని, నేడు బోరు వేయడంతో మంచినీటి సమస్య కూడా తీరిందని అన్నారు. గ్రామ పౌరులు, యువత, అన్ని వర్గాల వారు గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ భవనాలు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా జ్ఞాన కేంద్రాలుగా అభివృద్ధి చెందడానికి అందరు సహకరించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ యనగందుల శ్రీనివాస్, ఉప్పుల లింగయ్య, వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ భవనాల అభివృద్ధికి సహకరించండి: సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



