పోలీస్‌ సిబ్బంది సంక్షేమానికి కో-ఆపరేటివ్‌ సొసైటీ

Co-operative Society for the Welfare of Police Personnelవికారాబాద్‌ జిల్లా ఎస్పీ ఎన్‌.కోటిరెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్‌ ప్రతినిధి
పోలీస్‌ సిబ్బంది సంక్షేమానికి కో-ఆపరేటివ్‌ సొసైటీ ఏర్పాటు చేసినట్టు వికారాబాద్‌ జిల్లా ఎస్పీ ఎన్‌. కోటిరెడ్డి తెలిపారు. జిల్లా కో ఆపరేటివ్‌ సొసైటీ సర్వసభ్య సమావే శం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఉమ్మడి రంగారెడ్డి (సైబరాబాద్‌) జిల్లాలో భాగంగా ఉన్నటువంటి కో ఆపరేటివ్‌ సొసైటీని వేరు పరుచుకొని వికారాబాద్‌ జిల్లా పోలీస్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రతీ పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఇద్దరు సభ్యులను తీసుకోని, ఈ సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. ్ట సొసైటీలో 800 సభ్యులు, 7 మంది కార్యవర్గ సభ్యులు ఉన్నారని తెలిపారు. సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా సొసైటీ కార్యవర్గ సభ్యులను అడిగి తెల్సుకోవాలని సూచించారు. సొసైటీ విధివిధానాలను వివరించారు. ఈ కో-ఆపరేటివ్‌ సొసైటీకి జిల్లా ఎస్పీ ప్రెసిడెంట్‌గా, అద నపు ఎస్పీ వైస్‌ ప్రెసిడెంట్‌గా సెక్రటరీగా డీఎస్‌బీ ఇన్స్‌ స్పెక్టర్‌ ఉన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాస్‌రావు, ఏఆర్‌ డీఎస్‌బీ వీరేషం, ఇన్స్‌స్పెక్టర్‌ రాజు, డీసీఆర్‌బీ ఇన్స్‌స్పెక్టర్‌ వెంకటేశం, జిల్లా పోలీస్‌ ప్రెసిడెంట్‌ అశోక్‌, కో-ఆపరేటివ్‌ సొసైటీ కార్యవర్గ సభ్యలు, ఇతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Spread the love