ఆలిండియా ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ మరియు డిజిటల్ స్టూడెంట్ ఇన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం బెస్ట్ ఎడ్యుకేటర్ ఆవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్పూర్ శివారులో ఉన్న వందేమాతరం హైస్కూల్ కరస్పాండెంట్ విక్రాంత్ కు ఆలిండియా ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ డైరెక్టర్ శిజు, ట్రాస్మా రాష్ట్ర అధ్యక్షులు శేఖర్రావు, చీఫ్ అడ్వయిజర్ జయసింహాగౌడ్ బెస్ట్ ఎడ్యుకేటర్ఆవార్డును అందించారు. అవార్డు రావడం పాట్ల హర్షం వ్యక్తం చేస్తూ విక్రాంత్ ధన్యావాదాలు తెలిపారు.