Thursday, May 28, 2026
E-PAPER
Homeతాజా వార్తలునరేంద్ర మోడీ రాజకీయ కక్ష సాధింపు ధోరణి విడనాడాలని సీపీఐ(ఎం) నిరసన

నరేంద్ర మోడీ రాజకీయ కక్ష సాధింపు ధోరణి విడనాడాలని సీపీఐ(ఎం) నిరసన

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : కేరళం మాజీ ముఖ్యమంత్రి ఈనాటి ప్రత్యక్ష నాయకుడైన. పినరై విజయన్, నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు ధోరణితో ఈడి దాడులను చేయించింది. ఈ దాడులను నిరసిస్తూ సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ధర్నా చౌక్ లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిరసన ధర్నాను నిర్వహించి బిజెపి కక్ష సాధింపు ధోరణికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ.. దేశంలో సీపీఐ(ఎం) పార్టీ నాయకులు అత్యంత నీతి నిజాయితీతో ప్రజలకు జవాబుదారీగా ఉంటూ పని చేయటం జరుగుతుందని. గత పది సంవత్సరాల పాటు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన పినరై విజయం సొంత ఇల్లు కూడా లేకుండా ముఖ్యమంత్రి పదవి దిగిపోయిన వెంటనే అద్దె ఇంట్లోకి వెళ్లిపోవటం జరిగిందని అటువంటి నిజాయితీపరుడు అయిన విజయ్, ఆయన కుటుంబ సభ్యుల ఇండ్లపైన ఈడి దాడులను నిర్వహించటం జరిగింది.

ఈ సోదాల్లో అధికారులకు ఎటువంటి ఆధారాలు లభించలేదని కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం తమ రాజకీయ ప్రత్యర్థులను లొంగదీసుకొనుట కొరకు ఈడిని, సిబిఐ, ని ఇన్కమ్ టాక్స్ ను, తదితర సంస్థలను ఉపయోగించుకొని బయోత్పాత వాతావరణాన్ని సృష్టించి ఆ నాయకులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని, కానీ దేశంలో అత్యంత తక్కువ కాలంలోనే కుబేరులుగా మారిన ఆదాని, అంబానీ, తదితర పెద్ద కార్పొరేట్ వ్యక్తుల ఇళ్ల పైన మాత్రం ఎటువంటి దాడులు జరపకుండా, తమ అవసరాలకు ఉపయోగపడే విధంగా వారిని ఉపయోగించుకుంటున్నారని స్వాతంత్ర ఉద్యమంలో ఎటువంటి పోరాటం చేయని బీజేపీ నాయకులు ఈరోజు దేశ జాతీయత విలువల గురించి మాట్లాడుతున్నారని, కానీ బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా స్వాతంత్రం నా జన్మ హక్కు అనే నినాదంతో బ్రిటిష్ వారి తూటాలకు ఎదురొడ్డి నిలిచి పోరాడిన కమ్యూనిస్టులకు, ఇటువంటి ఈడీ దాడులతో భయపెట్టాలనుకుంటే వారివి అవివేకమే అవుతుందని ఆయన అన్నారు.

నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల మూలంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న సందర్భంలో వారిని దృష్టిని మరల్చడం కోసం సిపిఎం నాయకుల ను ఈడి దాడులు చేశారని ఇటువంటి ఈడీలు, బోడీలు, మోడీలు ఏమి చేయలేవని, ఇప్పటికైనా నరేంద్ర మోడీ తన విధానాన్ని మార్చుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆలోచించాలని ఆయన అన్నారు. లేని ఎడల రాబోయే కాలంలో సిపిఎం పార్టీ రాజకీయంగానే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుందని, ప్రజలందరూ ఈ కక్ష సాధింపు ధోరణికి వ్యతిరేకంగా కలిసి రావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు జిల్లా కమిటీ సభ్యులు సుజాత నగర నాయకులు నల్వాల నరసయ్య, అనసూయమ్మ, అనిత ,అంజయ్య, ఈవీఎల్ నారాయణ అబ్దుల్, రాము, ఇమామ్, రాజు, సతీష్, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -