విప్లవోద్యమ నేత డీవీకే ఆలోచనల వ్యాప్తికి కృషి చేద్దాం అని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ కేంద్రకమిటీ సభ్యులు కేజీ రాంచందర్ అన్నారు. పట్టణంలో శనివారం పార్టీ కార్యాలయం ఆవరణలో ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి డీవీ కృష్ణ విగ్రహ ఆవిష్కరణను చేసినారు. ఈ సందర్భంగా జరిన సభలో ఆయన మాట్లాడుతూ.. కామ్రేడ్ కృష్ణ విప్లవ సైద్ధంతికవేత్త అని, విప్లవ ఉద్దండుడు అని ఆయన విప్లవ ఉధ్యమాల వ్యాప్తి కోసం మరణం చివరి వరకు పరికపించిన మహోన్నతుడు అన్నారు. ఆయన పార్టీలో అతివాద మితవాద దోరనులకు వ్యతిరేకంగా 1980 నుండి సైద్ధాంతిక పోరాటం చేశాడన్నారు. కమ్యూనిస్టు విప్లవకారులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పంథా, కార్యక్రమంను రూపొందించుకుంటేనే పురోగతిలో ఉంటారని ఆయన డాక్యుమెంట్స్ ద్వారా ప్రపంచానికి చాటిన భారత విప్లవ పితామహుడు అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజల్లో విప్లవ రాజకీయాల ప్రచారం కోసం నడుము కట్టి పని చేశారన్నారు. ప్రజలు లేని విప్లవం విజయవంతం అవ్వలేదని, హీరోలు చరిత్రను మార్చలేరని డాకుమెంట్స్ తో ప్రజాపంథా వెలుగులో ప్రజాతంత్ర విప్లవం అన్న కొత్త సిద్ధాంతంను రూపొందించిన రూపకర్త అన్నారు. ప్రజలు ప్రజా సంఘాల ద్వారా భారతదేశంలో బలమైన విప్లవ ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉందని నిరూపించిన ఉత్తమ కమ్యూనిస్టు కామ్రేడ్ అని అన్నారు. కార్యక్రమం ముందు రెండు నిమిషాలు మౌనం పాటించి డివి కృష్ణకు నివాళులర్పించారు. కార్యక్రమానికి డివిజన్ కార్యదర్శి B. దేవరాం అధ్యక్షత వహించగా, రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు ప్రభాకర్, రాష్ట్ర కమిటీ సభ్యులు రామకృష్ణ, నిజామాబాద్ జిల్లా కార్యదర్శి కృష్ణ, డివి కృష్ణ కూతురు దివ్య, కృష్ణ తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి, సహచరులు ఆశీర్వాదం, పద్మారావ్, నిమ్మ నారాయణలు ప్రసంగించగా జిల్లా కమిటీ సభ్యులు ముత్తేన్న, గంగాధర్, మల్లేష్, రమేష్, సత్తేవ్వ, రాజేశ్వర్, కిషన్, గుమ్ముల గంగాధర్, కమిటీ సభ్యులు కిషన్, దామోదర్, రమ, బాబన్న, అశోక్, సాయరెడ్డి, రమేష్, ఆకుల గంగారాం, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.