ఖమ్మంపల్లి బ్రిడ్జిపై పగుళ్లు ప్రారంభం.?

– ఆరంభం సూరత్వమేనా.?
నవతెలంగాణ –  మల్హర్ రావు
మంథని నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టిన బ్రిడ్జిల నిర్మాణాలు ఆరంభం సూరత్వమేనా.? అన్నట్లుగా మారుతున్నాయి. ఇందుకు సాక్షాత్తు నిదర్సనమే రూ.లక్ష కోట్లతో నిర్మాణం చేసిన కాళేశ్వరం మెడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు భారీగా పగుళ్లు తెలి మొన్న దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది.ఆ సంఘటన మరువకముందే ఇటీవల అర్ధరాత్రి భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని గర్మిళపల్లి, పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని ఓదేడ్ మానేరుపై కోట్ల రూపాయలతో నిర్మాణ పనుల్లో కొనసాగుతున్న వంతెన అర్ధరాత్రి గాలిదుమారంతో కుప్పకూలి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ రెండు సంఘటనలపై ప్రజలు చర్చలు చేస్తున్న నేపథ్యంలో ఇటీవల రూ.50 కోట్లతో నిర్మాణం చేపట్టి రాకపోకలు కొనసాగుతున్న మండల కేంద్రమైన తాడిచెర్ల, ఖమ్మంపల్లి బ్రిడ్జిపై పగుళ్లు తెలి ఇనుప రాడ్లు సైతం బయటపడ్డాయి.గత ప్రభుత్వం బ్రిడ్జిలు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతోనే వరుస సంఘటనలు సంభవిస్తున్నాయని పలువురు విమర్శిస్తున్నారు.ఇప్పటికైనా ఆర్అండ్ బి అధికారులు బ్రిడ్జిలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
Spread the love