బాధిత కుటుంబాలను పరామర్శించిన దుద్దిల్ల శ్రీను బాబు

నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు గురువారం మంథని పట్టణానికి చెందిన మంతెన రాకేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, అలాగే విలోచవరం గ్రామానికి చెందిన ఆక్కపాక లక్ష్మి ఇటీవల వడదెబ్బతో ఉపాధి హామీ కూలి మృతి చెందగా బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love