ఆగని అక్రమ ఇసుక దందా..

– ఇండ్ల నిర్మాణానికి ఉచిత ఇసుక
– ఎక్కడో ఐదు వేల రూపాయలకు ట్రాక్టర్ అమ్మే అక్రమదారులకే మంజీరా నది సొంతం
– పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నా.. ఆగని ఇసుక దందా
– పోలీస్ స్టేషన్ నిండా ఇసుక వాహనాలు
నవతెలంగాణ – మద్నూర్
అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇండ్లు నిర్మించుకునే వారికి ఉచిత ఇసుక అనుమతులు ఇస్తామన్నది ఎక్కడో కానీ రూ.5000 రూపాయలకు ఇసుక ట్రాక్టర్ అమ్మే అక్రమదారులకే మంజీరా నది సొంతంగా కనిపిస్తోంది. అక్రమ ఇసుక రవాణాపై పోలీస్ శాఖ గట్టి నిఘా పెడుతూ, అప్పుడప్పుడు ట్రాక్టర్లను పట్టుకోవడం, సీజ్ చేసి కేసులు నమోదు చేసినా, అక్రమ ఇసుక దందా ఆగడం లేదు. అందుకు నిదర్శనం మూడు ట్రాక్టర్లను, ఒక బులోరాను పోలీసులు పట్టుకున్న వాహనాలే. మంజీరా నది అక్రమ ఇసుక దారులకు అడ్డగా మారింది. సొంత పట్టలాగే రాత్రి వేళల్లో ఇసుకను తరలించి వేలాది రూపాయలకు అమ్ముకుంటూ, లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. మద్నూర్ పోలీస్ స్టేషన్ లో అక్రమంగా ఇసుక తరలించే, పట్టుబడ్డ వాహనాలతో నిండిపోయింది. ఎన్నిసార్లు పట్టుబడ్డా, ఇసుక దందా ఆగడం లేదు. రెండు మూడు రోజులు తర్వాత మళ్లీ ఇసుక రవాణా చేపట్టడం ఆనవాయితీగా కనిపిస్తోంది. ఎందుకంటే అక్రమ ఇసుక దందా నివారించడంలో ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.
మంజీరా నది ఇసుక ప్రతిరోజు మహారాష్ట్రకు తరలివిస్తున్నారని ఆరోపణలు ప్రజల్లో వ్యక్తం అవుతుంది. ఇండ్లు కట్టుకునే వారికి ఒక్క ఇసుక ట్రాక్టర్ రూ.5000 చొప్పున అమ్ముతున్నారు. ఇంత పిరమా అంటే మేము అందరికీ మామూలు ఇవ్వవలసిందే, లేదంటే ఇసుక రావడం కష్టం కాబట్టి దొంగ చాటుగా తీసుకురావలసి వస్తుందని, అక్రమ ఇసుకదారులు ఇసుక అవసరం ఉన్న వ్యక్తులకు, అధికారులకు ఇచ్చే మామూళ్ల గురించి చెప్పడం, అధిక ధరలతో అమ్మడం, ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక చట్టం అమలు అయిందా లేదా అనేది ప్రజలకు తెలియని పరిస్థితి. ఉచిత ఇసుక తరలింపు గురించి రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులతో ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అక్రమ ఇసుక రవాణాపై గట్టిగా నిఘా పెట్టవలసిన అవసరం ఉంది. ఇండ్ల నిర్మాణదారులకు ఇసుక లభించడం కష్టంగా మారింది.రూ. 5000 అయినా రూ.6000 అయినా ఇసుక కొనుక్కొని ఇండ్లు కట్టుకుంటున్నారు. ఇసుక రవాణా ఎలా జరుగుతుందో కానీ తెల్లవారక మునిపే ఇండ్ల ముందర ఇసుక దిబ్బలు కనిపిస్తున్నాయి. అంటే అక్రమ ఇసుక రవాణాపై ప్రభుత్వం నిఘా ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు.  మూడు టాక్టర్లు పట్టుకున్నా.. మళ్లీ ఇసుక అక్రమ రవాణా ఆగుతుంది అనడానికి నమ్మకం లేదు. ఎందుకంటే ఇసుక అక్రమంగా తరలించే వ్యక్తులు అధికారులతో కుమ్మక్కు కావడం ప్రజల్లో వినబడే చర్చలు. ఏది ఏమైనా ప్రభుత్వం ఇండ్ల నిర్మాణదారులకు ఉచిత ఇసుక తీసుకువెళ్లడానికి అనుమతులు ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని ఇండ్ల నిర్మాణదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Spread the love