లయన్స్‌ క్లబ్‌ ఆమనగల్‌కు అవార్డుల పంట

A crop of awards for Lions Club Amanagal– మల్టిఫుల్‌ ఉత్తమ క్లబ్‌ పీఆర్‌ఓగా ఎంపికైన యంఏ.పాషా
గేలా సమావేశంలో అవార్డుల ప్రదానం
నవతెలంగాణ-ఆమనగల్‌
లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఆమనగల్‌కు అవార్డుల పంట పండింది. సోమవారం రాత్రి సికింద్రాబాద్‌లోని కేవీఆర్‌ కన్వెన్షన్‌ హాల్లో లయన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ మల్టీఫుల్‌ డిస్టిక్‌ 320ఏ వారి ఆధ్వర్యంలో జరిగిన గేలా సమావేశంలో 2022-23వ సంవత్సరానికి గాను ఆమనగల్‌ లయన్స్‌ క్లబ్‌ మల్టీఫుల్‌ గవర్నర్‌గా మాజీ గవర్నర్‌ జి.చెన్నకిషన్‌ రెడ్డి, మల్టీఫుల్‌ రీజియన్‌ చైర్మెన్‌ గా బావండ్ల వెంకటేష్‌, ఫాస్ట్‌ క్లబ్‌ బైరి కరుణాకర్‌ రెడ్డి, మల్టీఫుల్‌ క్లబ్‌ పీఆర్‌ఓగా యం.ఏ.పాషా అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను మల్టీఫుల్‌ క్లబ్‌ అవార్డులకు ఎంపికకు సహకరించిన క్లబ్‌ ఎల్‌ సీ ఎఫ్‌ ఏరియా లీడర్‌ లయన్‌ సందడి నరేందర్‌ రెడ్డికి, జి.చెన్నకిషన్‌ రెడ్డికి, జూలూరు రమేష్‌ బాబుకు, జూలూరు రఘుకు, వి.దామోదర్‌ రెడ్డితో పాటు క్లబ్‌ సభ్యులందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి ఉత్తమ అవార్డులు రావడం ఆమనగల్‌ క్లబ్‌కు గర్వకారణమని, క్లబ్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలకు సహకరించిన సభ్యులందరికీ పీఆర్‌ఓ పాషా ధన్యవాదాలు తెలిపారు. క్లబ్‌ ఆధ్వర్యంలో చేపట్టే సేవా కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేసి వాటిని క్షేత్ర స్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా అహర్నిశలు కృషి చేస్తున్న క్లబ్‌ పీఆర్‌ఓ పాషాను అభినందిస్తూ పలువురు సన్మానించి సత్కరించారు. కార్యక్రమంలో మల్టీఫుల్‌ చైర్మెన్‌ ఎం.విద్యాసాగర్‌ రెడ్డి, ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌ బాబురావు, మాజీ డైరెక్టర్‌ సునీల్‌ కుమార్‌, డిస్టిక్ట్‌ గవర్నర్‌ హరి నారాయణ బట్టడ్‌, ఎలక్ట్రి గవర్నర్‌ మహేంద్రకుమార్‌ రెడ్డి, కోటేశ్వర్‌ రావు, మాజీ గవర్నర్‌ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love