కరెంట్‌ అఫైర్స్‌

Current Affairsఐక్యరాజ్య సమితి భారత ప్రతినిధిగా బాగ్చీ
జెనీవాలోని ఐక్యరాజ్య సమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలకు భారత ప్రతినిధిగా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందరు బాగ్చీ నియమితులయ్యారు. బాగ్చీ ప్రస్తుతం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్నారు.
ఆప్గానిస్తాన్‌లో పెను భూకంపం
ఆఫ్గానిస్తాన్‌లో భూకంపం దాటికి మృతుల సంఖ్య 2000 దాటింది. తీవ్ర భూకంపం వలన మట్టితో నిర్మించిన వందలాది ఇళ్లు నేలమట ్టమయ్యాయి. ఆరు గ్రామాలు పూర్తిగా ద్వసం అయ్యాయి. ఆప్గాన్‌లో అతి పెద్ద నగరమైన హెరల్‌ కేంద్రంగా భూకంపం సంభవించింది. 9,240 మంది తీవ్రంగా గాయపడ్డారు. 1320 ఇళ్ళు నేల మట్టం అయ్యాయి.
ఇజ్రాయిల్‌ పాలస్తీనా మధ్య భీకర యుద్ధం
ఇజ్రాయిల్‌ సైన్యం, పాలస్తీనా మిలిటెంట్‌ సంస్థ హమాస్‌ మధ్య బీకర యుద్ధం కొనసాగుతూనే వుంది. హమాస్‌ మిలిటెంట్లు, ఇజ్రాయిల్‌ జవాన్ల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. గాజా నుంచి ఇజ్రాయిల్‌ భూభాగం లోనికి చొచ్చుకొని వచ్చిన తీవ్ర వాదులు వీధుల్లో జవాన్లతో తలపడుతున్నారు. హమాస్‌ దుశ్చర్య పట్ల ప్రతీకారంతో రగలిపోతున్న ఇజ్రాయిల్‌ సైన్యం పెద్ద సంఖ్యలో రాకెట్లను గాజాపై ప్రయోగించింది.
ఆస్కార్‌ యాక్టర్స్‌ జాబితాలో ఎన్టీఆర్‌
ది అకాడమీ ఆఫ్‌ మోహన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ (ఆస్కార్‌ కమిటి) తాజాగా వెల్లడించిన మెంబర్‌ క్లాస్‌ ఆఫ్‌ యాక్టర్స్‌ జాబితాలో ఎన్టీఆర్‌కు చోటు దక్కింది. ఎన్టీఆర్‌తో పాటు ఆమెరికన్‌ నటుడు కె.హ్యూ క్వాన్‌, అమెరికన్‌ నటి మార్షా స్టెపానీ బ్లేక్‌, ఐరన్‌ నటి కెర్రీ కాండన్‌, అమెరికన్‌ కమ్‌ కెనెడియన్‌ నటి రోసా సలాజర్‌లో ఈ జాబితాలో నమోదయ్యారు.
‘శ్రద్ధాంజలి’ని ప్రారంభించిన అస్సాం ముఖ్యమంత్రి
అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్పో శర్మ 2023 అక్టోబర్‌ 19న గౌహతిలో కొత్తగా నిర్మించిన శ్రద్ధాంజలి ఫ్లై ఓవర్‌ను ప్రారంభిం చారు. ఇది కేవలం 60 రోజుల్లో పూర్తి కావడంతో దీనిని ఒక విజయంగా భావిస్తున్నారు. 2.28 కిలో మీటర్లు పొడవున్న శద్దాంజలి ఫ్లై ఓవర్‌ ఆర్‌.జి బారుV్‌ా రోడ్‌లోని సుందరాపూర్‌లో కామర్స్‌ పాయింట్‌ను కలుపుతూ రాష్ట్రంలో 2వ పొడవైన ఫ్లై ఓవర్‌గా పరిగణించబడుతుంది.
– కె. నాగార్జున
కరెంట్‌ ఎఫైర్స్‌ సీనియర్‌ ఫ్యాకల్టీ
9490352545

Spread the love