శ్రీభాగ్‌ ఒప్పందం ఎప్పుడు జరిగింది?

1. భారత రాజ్యాంగంలోని క్రింది ఏ అధికరణలు భారత భూభాగ పరిధి గురించి పేర్కొంటున్నాయి?
1.5 నుండి 11 2. 12 నుండి 34
3.1 నుండి 4 4. ఏది కాదు.
2. యూనియన్‌ అనే పదాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించారు?
1.బ్రిటన్‌ 2. అమెరికా
3. ఐర్లాండ్‌ 4. కెనడా
3. సమాఖ్య విధానం మన రాజ్యాంగ మౌళిక స్వరూపం లో అంతర్భాగం అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు నిచ్చింది?
1. మినర్వా మిల్స్‌ కేసు
2.యస్‌.ఆర్‌.బొమ్మాయి కేసు
3. కామన్‌కాజ్‌Vర ఖఉ× 4. ఏది కాదు.
4. ఈ క్రింది ఏ నిబంధన ప్రకారం ఒక భూభాగాన్ని విదేశాలకు బదిలీ చేసే అధికారం పార్లమెంట్‌కు ఉంటుంది?
1. 2వ నిబంధన 2. 4వ నిబంధన
3. 5వ నిబంధన 4. 3వ నిబంధన
5. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పాండిచ్ఛేరిని ఫ్రెంచ్‌ వారి నుండి స్వాధీనం చేసుకొని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు?
1. 10వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 12వరాజ్యాంగ సవరణ చట్టం
3. 14వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 56వ రాజ్యాంగ సవరణ చట్టం
6. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రముల పునర్‌ వ్యవస్థీకరణ అనగా
ఎ. రాష్ట్రముల విస్తీర్ణం మార్చడం
బి. రాష్ట్రముల పేర్లు మార్చడం
సి. రాష్ట్రముల సరిహద్దులు మార్చడం
డి. కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం.
1.ఎ,బి,డి 2. బి,డి
3. ఎ,సి,డి 4. ఎ,బి,సి,డి
7. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యం / వాక్యాలు గుర్తించండి.
ఎ. రాష్ట్రముల పునర్‌ వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటు మొదటగా లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెట్టవలెను.
బి. రాష్ట్రముల పునర్‌ వ్యవస్థీకరణ బిల్లు విషయంలో పార్లమెంటు ఉభయ సభల మధ్య ప్రతిష్టంభణ ఏర్పడితే సంయుక్త సమావేశం ఏర్పాటు చేయరాదు.
1. బి మాత్రమే 2. ఎ,బి
3. ఎ మాత్రమే 4. ఏదికాదు.
8. భాషా ప్రయుక్త ప్రావిన్స్‌ల కమిటీలో గల సభ్యులను గుర్తించండి.
1.రాజేంద్రప్రసాద్‌, జగత్‌ నారాయణ్‌లాల్‌, పన్నాలాల్‌
2. జగత్‌ నారాయణ్‌, పన్నాలాల్‌, అంబేద్కర్‌
3. ఎస్‌ కె ధార్‌, పన్నాలాల్‌, జగత్‌ నారాయణ్‌.
4. నెహ్రూ,వల్లభారుపటేల్‌, పట్టాభిసీతారామయ్య
9. ఫజిల్‌ అలీ కమీషన్‌ ను నెహ్రూ ప్రభుత్వం ఏ సం.లో నియమించింది?
1. 1955 2. 1954 3. 1953 4. 1951
10. ప్రస్తుతం భారతదేశంలో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య?
1. 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు
2. 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు
3. 29 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు
4. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు
11. కింది వాటిలో సరికానిది గుర్తించండి.
1. పార్ట్‌ – ఎ రాష్ట్రాలు- బ్రిటిష్‌ పాలిత ప్రాంతాలు
2. పార్ట్‌ – సి రాష్ట్రాలు – ప్రత్యేక శాసన సభలను కలిగి స్వదేశీ సంస్థానాలు.
3. పార్ట్‌ – డి రాష్ట్రాలు – అండమాన్‌ నికోబార్‌ దీవులు 4. పైవన్నీ
12. శ్రీభాగ్‌ ఒప్పందం ఎప్పుడు జరిగింది?
1. 16 అక్టోబర్‌ 1935
2. 16 నవంబర్‌ 1948
3. 16 అక్టోబర్‌ 1939
4. 16 నవంబర్‌ 1937
13. దేశంలో ఒక భూభాగాన్ని బదిలీ చేసే అధికారం ఎవరికి కలదు?
1. రాష్ట్రపతి 2. పార్లమెంటు
3. కేంద్రమంత్రి మండలి 4. ఎవరూ కాదు.
14. క్రింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దాద్రానగర్‌ హవేలిని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు?
1. 14వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 10వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 12వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 9వ రాజ్యాంగ సవరణ చట్టం
15.బెంగాల్‌ విభజనను ఏ సం.లో ఎవరు రద్దు చేశారు?
1. 1911 లార్డ్‌ హార్డింజ్‌ 2. 1905 రాబర్ట్‌ రిస్లే
3. 1911 లార్డ్‌ కర్జన్‌ 4. 1905 లార్డ్‌ కర్జన్‌
16. శ్రీభాగ్‌ ఒప్పందంలో సంతకాలు చేసినవారు?
ఎ. కల్లూరి సుబ్బారావు బి. వెంకటప్ప నాయుడు
సి. కొండా వెంకటప్పయ్య డి. కోకా సుబ్బారావు
1. ఎ,బి,డి 2. ఎ,సి,డి
3. ఎ,బి,సి 4. ఎ,బి,సి,డి
17. క్రింది కమిటీ / కమీషన్‌ సింధ్‌, ఒరిస్సా రాష్ట్రాలను భాషా ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని తన నివేదికలో పేర్కొంది?
1.మోతీలాల్‌ నెహ్రూ 2. సైమన్‌ కమీషన్‌
3. ఫజిల్‌-అలీ కమీషన్‌ 4. జెవిపి కమిటీ
18. ఆంధ్ర రాష్ట్ర విధి విధానాలను రూపొందించడానికి ఏర్పాటు చేసిన కమిటీఏది?
1. సర్కారియా కమిటీ 2. వర్మ కమిటీ
3. ఫజిల్‌ అలీ కమీషన్‌
4. కైలాస్‌నాథ్‌ వాంఛు కమిటీ
19. జె.ఎన్‌. చౌదరి నేతృత్వంలో భారత సైన్యం క్రింది ఏ పేరిట హైదరాబాద్‌ సంస్థానాన్ని నియంత్రణలోకి తీసుకుంది?
1. ఆఫరేషన్‌ విజరు 2. ఆఫరేషన్‌ బ్లూస్టార్‌
3. ఆఫరేషన్‌ పోలో 4. ఏది కాదు.
20. క్రింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సిక్కింను భారత్‌లో విలీనం చేశారు?
1. 40వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 39వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 35వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 100వ రాజ్యాంగ సవరణ చట్టం
21. కింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అస్సాంలోని కొంత భాగాన్ని బంగ్లాదేశ్‌కి బదిలీ చేయడం అలాగే బంగ్లాదేశ్‌లోని కొంత భాగాన్ని భారత్‌కి బదిలీ చేశారు?
1. 42వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 39వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 56వ రాజ్యాంగసవరణ చట్టం
4. 100వ రాజ్యాంగ సవరణ చట్టం
22. ఆంధ్ర రాష్ట్రము ఏర్పడినపుడు జిల్లాల సంఖ్య?
1. 13 2. 12 3. 11 4. 10
23. 1952 హైదరాబాదు అసెంబ్లీ ఎన్నికల ద్వారా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి yవరు?
1.జెఎన్‌ చౌదరి
2.బూర్గుల రామకృష్ణారావు
3. బెజవాడ గోపాలరెడ్డి
4. మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌
24. క్రింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఎ,బి,సి,డి రాష్ట్ర వర్గీకరణను రద్దు చేశారు?
1. 5వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 9వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 11వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 7వ రాజ్యాంగ సవరణ చట్టం
25. క్రింది వాటిలో ఫజిల్‌ అలీ కమీషన్‌ సిఫార్సులు ఏవి?
ఎ. జాతీయ మైనారిటీ భాషల కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం.
బి. జోనల్‌ కౌన్సిల్‌, ప్రాంతీయ మండలాలను ఏర్పాటు చేయడం.
1. బి మాత్రమే 2. ఎ,బి
3. ఏది కాదు. 4. ఎ మాత్రమే
26. సమాఖ్య అనే పదానికి బదులు యూనియన్‌ అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చాలని సిఫార్సు చేసినవారు?
1. రాజేంద్రప్రసాదు 2. నెహ్రూ
3. అంబేద్కర్‌ 4. వల్లభారుపటేల్‌
27. రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలంటే రాష్ట్రపతి పూర్వ అనుమతి తప్పనిసరి అనే అంశాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు?
1. 5వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 7వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 9వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 10వ రాజ్యాంగ సవరణ చట్టం
28. ఆంధ్ర రాష్ట్ర మొదటి ఉపముఖ్యమంత్రి?
1. టంగుటూరి ప్రకాశం పంతులు
2. బెజవాడ గోపాల రెడ్డి
3. నీలం సంజీవరెడ్డి 4. సి.ఎం. త్రివేది
29. కింది వాటిలో పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలు ఏవి?
ఎ. ప్రత్యేక తెలంగాణ ప్రాంతీయ బోర్డును ఏర్పాటు చేయాలి.
బి. గుంటూరు విజయవాడకు మధ్య హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు.
1. ఎ మాత్రమే 2. ఎ,బి
3. బి మాత్రమే 4. ఏది కాదు.
30. విశాలాంధ్ర సంస్థను ఏ సం.లో స్థాపించారు?
1. 1945 2. 1948 3. 1937 4. 1950
31. పెద్ద మనుషుల ఒప్పందంలో సంతకాలు చేసినవారు?
ఎ. కెవి రంగారెడ్డి బి. పట్టాభి సీతారామయ్య సి.అల్లూరి సత్యనారాయణ
డి. బూర్గుల రామకృష్ణారావు
1. ఎ,బి,సి 2. ఎ,సి
3. ఎ,సి,డి 4. ఎ,బి,సి,డి
32. శ్రీకృష్ణ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1. 30.1 2.2010 2. 30.10.2009
3.3.2.2010 4. 30.03.2011
33. జతపరుచుము.
రాష్ట్రము వరుసక్రమం
ఎ. అరుణాచల్‌ ప్రదేశ్‌ 1. 15వ రాష్ట్రం
బి. గుజరాత్‌ 2. 18వ రాష్ట్రం
సి. త్రిపుర 3. 24వ రాష్ట్రం
డి. హిమాచల్‌ప్రదేశ్‌ 4. 20వ రాష్ట్రం
1. ఎ2, బి3, సి1, డి4 2. ఎ1, బి2, సి3, డి4
3. ఎ3, బి1, సి4, డి2 4. ఎ3, బి1, సి2, డి4
34. దాద్రానగర్‌ హవేలిని, డామన్‌ డయ్యు విలీనం చేసే బిల్లు రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది.
1. 26.01.2020 2. 26.01.2020
3. 26.11.2019 4. 9.12. 2019
35. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఢిల్లీని నేషనల్‌ కాపిటల్‌ టెరీటరీ ఆఫ్‌ ఢిల్లీగా పిలుస్తారు?
1. 65వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 55వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 42వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 69వ రాజ్యాంగ సవరణ చట్టం
36. ఏ సం.లో పాండిచ్చేరికి పుదుచ్చేరి అని పేరు మార్చారు?
1. 2010 2. 2004 3. 2006 4. 2002
37. ఏ కమిటీ సూచన మేరకు దేశంలో ప్రాంతీయ మండలాలు ఏర్పాటు చేశారు?
1.వాంఛూ కమిటీ 2. జెవిపి కమిటీ
3. సర్కారియా కమీషన్‌ 4. ఫజిల్‌ అలీ కమీషన్‌
38. జతపరుచుము.
ఎ.తూర్పు ప్రాంతీయ మండలం 1. అలహాబాదు
బి. దక్షిణ ప్రాంతీయ మండలం 2. కోల్‌కత్తా
సి. మధ్య ప్రాంతీయ మండలం 3. ముంబాయి
డి. పశ్చిమ ప్రాంతీయ మండలం 4. చెన్నై
1. ఎ1, బి2, సి3, డి4 2. ఎ1, బి3, సి4, డి2
3. ఎ2, బి1, సి4, డి3 4. ఎ2, బి4, సి1, డి3
39. ఈశాన్య రాష్ట్రముల మండలిని ఏ సం.లో ఏర్పాటు చేశారు?
1. 1971 2. 1972
3. 1973 4. 1974
40. జోనల్‌ కౌన్సిల్‌ విధులు ఏవి?
1. సమాఖ్య వ్యవస్థను పరిరక్షించడం
2. కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం
3. విభిన్న ప్రాంతాల మధ్య రాజకీయ సమతుల్యతను
సాధించడం 4. పైఅన్నీ

సమాధానాలు
1.3 2.4 3.2 4.1 5.3
6.4 7.3 8.3 9.3 10.4
11.2 12.4 13.2 14.2 15.1
16.3 17.2 18.4 19.3 20.3
21.4 22.3 23.2 24.4 25.2
26.3 27.1 28.3 29.2 30.2
31.3 32.3 33.3 34.1 35.4
36.3 37.4 38.4 39.2 40.4
డాక్టర్‌ అలీ సార్‌
భారత రాజ్యాంగ నిపుణులు
9494228002 

Spread the love