Saturday, June 20, 2026
E-PAPER
Homeమానవినాన్న జేబు

నాన్న జేబు

- Advertisement -


నాన్న జేబు…
చొక్కాకి కుట్టిన
చిన్నగుడ్డ ముక్క కాదు
అది…
కుటుంబం మొత్తాన్ని
గుండెలకి దగ్గరగా దాచుకున్న
మౌనపు గది.
అందులోనే పిల్లల కోసం
మడతపెట్టిన తన
కోరికల త్యాగం.
కొత్తచొక్కా అడుగుతున్న
మనసును అదిమిపెట్టి
తన కోరిక భుజానికి
పిల్లల స్కూల్ బ్యాగు
తగిలించిన జేబు అది.
ఆ జేబు నిండేది
కుటుంబం కోసం.
అమ్మ ప్రేమ ఒక నది
నాన్న బాధ్యత ఒక మేఘం
ఆ జేబులో పదిలం
ఇంటి భవిష్యత్తు.
నాన్న జేబు…
చెమటతో నింపి
ప్రేమతో పంచిపెట్టే
ఓ నిశ్శబ్ద కావ్యం!
సాధన.తేరాల, ఖమ్మం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -