కూతురంటే అమ్మకు ప్రతిరూపం

Daughter is the counterpart of motherఆడపిల్ల ఇంటికి వెలుగు. ఆమె భారమని భావిస్తే ఈ లోకమే ఉండదు. ‘వినాస్త్రీయ జననం నాస్తి, వినాస్త్రీయ గమనం నాస్తి, వినాస్త్రీయ జీవం నాస్తి, వినాస్త్రీయ సృష్టి ఏవన్నాస్తి’ అంటే స్త్రీ లేకపోతె జననం లేదు, స్త్రీ లేకపోతె గమనం లేదు.. స్త్రీ లేకపోతె జీవం లేదు, స్త్రీ లేకపోతె ఈ సృష్టే లేదు. సృష్టికి మూలం స్త్రీ. కూతురంటే అమ్మకు ప్రతిరూపం. అమ్మ మనల్ని కంటికి రెప్పలా ఎలా కాపాడుతుందో.. కూతురిని కూడా మనం అంతే ప్రేమతో చూసుకోవాలి. ఎంత మంది అబ్బాయిలున్నా సరే ఒక్క కూతురు ఉంటే చాలు.. ఆ కళే వేరుగా ఉంటుంది.
‘ఆడపిల్ల లేని ఇల్లు చందమామ లేని ఆకాశం ఒక్కటే.. అందుకే ప్రతి ఇంటిలో వెన్నెలలా ఓ కూతురు ఉండాలి’ అంటారు పెద్దలు. కూతురంటే అందమైన అనుబంధం.. అంతేలేని అనురాగం.. మరపురాని జ్ఞాపకం. అలాంటి ఆడపిల్ల గొప్పదనాన్ని చాటిచెప్పే ప్రత్యేకమైన రోజు డాటర్స్‌ డే. తల్లిలా, సోదరిలా.. నాన్నకు నీడలా, అమ్మకు తోడుగా, సోదరుడికి అండగా ఉంటూ ముద్దులొలికే చిన్నారి తల్లికి ప్రేమను పంచడమే కాదు పురిట్లోనే ఆడపిల్లను చిదిమేసే ఈ సమాజానికి ఆమెలేని లోకం లేదని చెప్పడమే ఈ రోజు ప్రత్యేకం. ఏటా సెప్టెంబర్‌ నాలుగో ఆదివారాన్ని ‘డాటర్స్‌ డే’గా జరుపుకుంటున్నాం.
ఆడపిల్ల ఇంటికి వెలుగు. ఆమె భారమని భావిస్తే ఈ లోకమే ఉండదు. ‘వినాస్త్రీయ జననం నాస్తి, వినాస్త్రీయ గమనం నాస్తి, వినాస్త్రీయ జీవం నాస్తి, వినాస్త్రీయ సృష్టి ఏవన్నాస్తి’ అంటే స్త్రీ లేకపోతె జననం లేదు, స్త్రీ లేకపోతె గమనం లేదు.. స్త్రీ లేకపోతె జీవం లేదు, స్త్రీ లేకపోతె ఈ సృష్టే లేదు. సృష్టికి మూలం స్త్రీ. కూతురంటే అమ్మకు ప్రతిరూపం. అమ్మ మనల్ని కంటికి రెప్పలా ఎలా కాపాడుతుందో.. కూతురిని కూడా మనం అంతే ప్రేమతో చూసుకోవాలి. ఎంత మంది అబ్బాయిలున్నా సరే ఒక్క కూతురు ఉంటే చాలు.. ఆ కళే వేరుగా ఉంటుంది. వాస్తవానికి ఆడ పిల్లల కోసం ఓ రోజంటూ ఏర్పాటు చేసుకొని దాన్ని సెలబ్రేట్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి రోజూ ఆడపిల్లలదే. వాళ్లతోనే ఆనందం.. వారి వల్లే ఇంట్లో సంతోషం.
అయితే కూతుళ్ల కంటే కొడుకులకే ఎక్కువ విలువ ఇచ్చే మన దేశంలో ఆడపిల్లలకూ సమానమైన ప్రేమ, సంతోషం పంచాలని కోరుకుంటూ జరుపుకొనే రోజు ఇది. మీ కూతురు మీకు ఎంత విలువైన బహుమానమో తెలియజేసే రోజు ఇది. కానీ ఈ పురుషాధిక్య సమాజంలో స్త్రీలకు.. ముఖ్యంగా కూతుళ్లకు కొడుకులకు ఇచ్చినంత విలువ ఇవ్వడం లేదు. శతాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ స్త్రీలు కేవలం మగపిల్లలకే జన్మనివ్వాలని చాలామంది కోరుకుంటున్నారు. ఈ భావనే అమ్మాయిల్లో ఆత్మన్యూనతను పెరిగేలా చేస్తుంది. అలాగే అబ్బాయిలు చేసే పనులు అమ్మాయిలు చేయలేరనే చిన్నచూపు చూసేలా చేస్తుంది. ఈ భావన స్త్రీ జనాభాను తగ్గిస్తున్నది. లింగ వివక్షకూ, భ్రూణ హత్యలకు కారణమైంది. ఈ సమస్య కేవలం మన దేశంలో మాత్రమే కాదు.. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉంది. అలాంటి భావనలు రూపుమాపాలనే ఈ రోజును జరపడం ప్రారంభించాయి పలు దేశాలు. కూతుళ్లు కొడుకుల కంటే తక్కువేం కాదని.. ఇద్దరూ సమానమని ఈ సమాజానికి అవగాహన కల్పించాలి.
రోజురోజుకు అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వీటిపై శ్రద్ధ వహించి వారి రక్షణ పట్ల ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. అప్పుడే సమాజంలో అమ్మాయిలు గౌరవంగా జీవించగలుగుతారు. సమాజాభివృద్ధిలో మహిళలు కూడా ఒక భాగం. దీన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోవాలి. కూతురంటే ఆలోచన కాదు పెంచాలా తీసేయాలా అని ఆలోచించడానికి. కూతురంటే నష్టం కాదు, లావాదేవీలు మాట్లాడడానికి. కూతురంటే రేపటి తరానికి అమ్మ, తనే మన మనుగడకి, మన జీవితానికి నిరూపణ అని గుర్తెరికి మసులుకోవాలి.

Spread the love