ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తున్న డిసిఓ

– సహకార చట్టాలపై కనీస అవగాహన లేదు.
– జివో 31 ప్రకారం డిసిఓ రైతులకు సమాధానం చెప్పాలి
– పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మదుకర్ మండిపాటు
నవతెలంగాణ-మల్హర్ రావు
భూపాలపల్లి డిసిఓ ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తూ, సహకార చట్టాలను నిర్వీర్యం చేస్తోందని పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మదుకర్ మండిపడ్డారు. బుధవారం తాడిచెర్ల పిఏసిఎస్ కార్యాలయంలో చైర్మన్ చెప్యాల రామారావు,బిఆర్ఎస్ డైరెక్టర్లు పొట్ట రాజమ్మ రాజయ్య, మల్కా రాజేశ్వర్ రావు,మాచర్ల సురేష్, సుంకు రాము లను జెడ్పి చైర్మన్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పుట్ట మాట్లాడారు పిఏసిఎస్ రామారావుపై కాంగ్రెస్ సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాసం నేపథ్యంలో సెలవులు పోను 18 రోజుల్లో సెక్షన్ 31 ప్రకారం ఈ నెల 26న ఫోరమ్ లేకుంటే అవిశ్వాసం విగిపోయినట్లుగా ప్రకటించకుండా డిసిఓ కాంగ్రెస్ కండువా వేసుకున్నట్లుగా వ్యవహరించడం జరిగిందని అసహనం వ్యక్తం చేశారు.అధికారులు చట్టాలకు లోబడి పని చేయాలని కానీ భూపాలపల్లి డిసిఓ ఇందుకు విరుద్ధంగా పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఆరోపించారు.కాంగ్రెస్ సభ్యులు పెట్టిన అవిశ్వాసంపై రెండు రోజుల పాటు వాయిదా వేయడంపై రైతులు డిసిఓ సమాధానం చెప్పాలన్నారు.కాంగ్రెస్ సభ్యులు సమావేశానికి గైహాజరవడంతో బిఆర్ఎస్ అవిశ్వాసం నెగ్గినట్లుగా తెలిపారు. బిఆర్ఎస్ డైరెక్టర్లు ప్రలోభాలకు తలొగ్గకుండా నిజాయితీగా ఉండి రామారావుకు మద్దతు తెలిపినందుకు వారికి బిఆర్ఎస్ పార్టీ తరుపున కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడ్డ కాంగ్రెస్ నాయకులను తప్పా బిఆర్ఎస్ నాయకులను పార్టీలో చేర్చుకోమని చిలుక పలుకులు పలికిన సిఎంతో పాటు పలువురు బిఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేయకుండా బిఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడమే పని పెట్టుకోవడం సరికాదన్నారు.కాంగ్రెస్ కార్యకర్తలు తలదించుకునేలా కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ కార్యకర్తలను ప్రలోభాలకు గురిచేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తాడిచెర్ల ఎంపీటీసీ-1 రావుల కల్పన మొగిలి, మాజీ సర్పంచ్ సుంకరి సత్తయ్య, మాజీ జెడ్పిటిసి గోనె శ్రీనివాసరావు, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాఘవ రెడ్డి,యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్,మంథని మార్కెట్ డైరెక్టర్ రాజేశ్వరరావు,బిఆర్ఎస్ నాయకులు జక్కు రాకేష్,తాజాద్దీన్, మల్లేష్,సమ్మయ్య,రాములు, నర్సయ్య పాల్గొన్నారు.
Spread the love