తెలంగాణ ఉద్యమకారుడు కొమురన్న మృతి

నవతెలంగాణ- చందుర్తి
తెలంగాణ ఉద్యమకారుడు వెంగళ కొమురన్నగౌడ్  శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో మరణించాడు.. దీంతో ఉమ్మడి చందుర్తి మండలంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కొమురయ్య 2000 సంవత్సరం నుండి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. వివిధ వేషధారణతో తెలంగాణ ఉద్యమంలో తనదైన శైలిలో ముద్ర వేసుకున్నాడు.. తెలంగాణ వచ్చేదాకా ఉద్యమమే ఊపిరి అంటూ గులాబీ జెండా పట్టి పోరాటం చేశాడు.. దీంతో  కొమరన్న పేరు తెలవని వ్యక్తి లేడు
తెలంగాణ వచ్చిన గుర్తింపు లేని కొమురన్న
తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు ఎనలేని పోరాటం చేసిన వెంగళ కొమరయ్య తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పార్టీలో గులాబీ పార్టీలో ఎలాంటి సముచిత స్థానం ఇవ్వకపోవడంతో ఆయన ఎంతో మనస్థాపానికి గురయ్యాడు అదేవిధంగా ఉద్యమంలో అంటే ఎరుగని అపరిచితులకు పదవులు ఇచ్చి కొమురయ్యకు మోసం చేశారని బీఆర్ఎస్ పార్టీపై  ఉమ్మడి మండల ప్రజలు విమర్శలు చేశారు. ఏది ఏమైనా కొమురయ్య ఊపిరి ఉద్యమంతోనే ఆగిందని చెప్పక తప్పదు.

Spread the love