వైభవంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలి..

– ఎంపిపి బాదవత్ రమేష్ నాయక్
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు 2014-2023,(జూన్ 2, 2023 నుంచి జూన్ 22, 2023 వరకు) నిర్వహించే ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి మండలం లోని అన్ని గ్రామ పంచాయతీ లలో ఏర్పాట్లు చేసే విధంగా అందరూ కృషి చేయాలని ఎంపిపి బాదవత్ రమేష్ నాయక్ అన్నారు. గురువారం ఇందల్ వాయి మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ లకు చెందిన పంచాయతీ కార్యదర్శులతో తహసిల్దార్ టివి రోజా, ఎంపిడిఓ రాములు నాయక్ ఎంపిఓ రాజ్ కాంత్ రావు లతో కలిసి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి రోజూ వివిధ రకాల కార్యక్రమాలను వివరించారు. జూన్ పతాకావిష్కరణ, అమరులకు ఉత్సవాల ప్రారంభం. 3న తెలంగాణ రైతు దినోత్సవం రైతులతో సహపంక్తి భోజనాలు, 4న పోలీసుశాఖ వారిచే ‘సురక్షా దినోత్సవం’ మరియు సంబంధిత కార్యక్రమాలు,5న తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం’ విద్యుత్తు రంగంలో విజయాలు, సింగరేణి సంబురాలు, ‘తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం’ ఇండస్ట్రియల్, ఐటీ కారిడార్లలో సభలు, సాగునీటి దినోత్సవం’ సాగునీటి రంగంలో విజయాలపై సభలు,7న”ఊరూరా చెరువుల పండుగ సాంస్కృతిక హేల చెరువు కట్టలపై సభలు,తెలంగాణ సంక్షేమ సంబురాలు’ సంక్షేమ పథకాలపై లబ్ధిదారులతో సభలు, జై తెలంగాణ సుపరిపాలనా దినోత్సవం’ ప్రజలకు కలిగిన మేలును తెలియజేసే కార్యక్రమాలు, తెలంగాణ సాహిత్య దినోత్సవం’ కవి సమ్మేళనాలు, కవితల పోటీలు, పోలీసు శాఖ ఆధ్వర్యంలో ”తెలంగాణ రన్’తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం’ మహిళా ఉద్యోగులకు సన్మానం,’తెలంగాణ వైద్య, ఆరోగ్య దినోత్సవం”తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం’ పల్లెలు సాధించిన ప్రగతిపై,తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం’ పట్టణ ప్రగతి ద్వారా సాధించిన ప్రగతిపై కార్యక్రమాలు,తెలంగాణ గిరిజనోత్సవం’ గిరిజన గ్రామాల్లో కార్యక్రమాలు,తెలంగాణ మంచినీళ్ళ పండుగ తాగునీటి రంగంలో సాధించిన విజయాలపై సభలు తెలంగాణ హరితోత్సవం’ మొక్కలు నాటే కార్యక్రమం,తెలంగాణ విద్యా దినోత్సవం’ విద్యారంగంలో సాధించి విజయాలపై సభలు,తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం’ ప్రార్థనా మందిరాల్లో వివిధ కార్యక్రమాలు, అమరుల సంస్కరణ’ అమరులకు శ్రద్ధాంజలి. హైదరాబాద్ లోని 22 అమరుల స్మారక చిహ్నం ప్రారంభం తదితర కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఆదేశించారు.ఈ సమావేశం లో పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love