పల్లె ప్రగతి ఘనత చాటేలా దశబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలి

నవతెలంగాణ – తాడ్వాయి
పల్లె ప్రగతి ఘనత చాటేలా దశబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల పై ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రగతి దినోత్సవం పగడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. గ్రామ పంచాయతీలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు నాడు నేడు ఫ్లెక్సీల ద్వారా ఏర్పాటు చేయాలని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేయాలని పేర్కొన్నారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గ్రామీణులకు వివరించాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అవార్డుల ను తెలియజేయాలని సూచించారు. చెరువుల పండుగలు పంచాయితీ అధికారులు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ నుంచి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడారు. పల్లె ప్రగతి దినోత్సవం రోజు కళాజాత ప్రదర్శన ద్వారా గ్రామీణులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. పారిశుద్ధ్య నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. జిల్లా నుంచి ఇద్దరిని ఉత్తమ పారిశుద్ధ్యకార్మికులను ఎంపిక చేసి రాష్ట్రానికి పంపుతామని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో డిపిఓ శ్రీనివాసరావు, అదనపు డిఆర్డిఓ మురళీకృష్ణ, జెడ్పి సీఈవో సాయ గౌడ్, అధికారులు పాల్గొన్నారు.

Spread the love