రుణ గ్రహితలకు ఖాతాల్లో డబ్బులు జమా

నవతెలంగాణా- ముత్తారం: పంట రుణ గ్రహితలైన రైతులకు డబ్బులు ఖాతాల్లో జమా అయ్యాయని పిఎసిఎస్‌ చైర్మన్‌ గుజ్జుల రాజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 11.12.2018 వరకు రుణం తీసుకొని నిల్వ బాకీ ఉన్న పంట రుణాలు లక్ష వరకు సిఎం కెసిఆర్‌ రుణ మాఫీ ప్రకటించి, విడతల వారీగా ఇప్పటి వరకు 99,999 నిల్వ బాడీ వరకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముత్తారం నందు 192 మంది రైతులకు గాను 1,12,15,757 రూపాయలను జమా చేసిందని తెలిపారు. మొదటిసారి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తదుపరి 2014 సంవత్సరములో కూడా పంట ఋణముల మాఫీ ప్రకటించి, అమలు చేశారని తెలిపారు. రైతుల పక్షపాతిగా అనేక ఇతర పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న సిఎం కెసిఆర్‌కు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు
Spread the love