ఆంజనేయ స్వామి ఆలయానికి తండోపతండాలుగా తరలివచ్చిన భక్తులు

– నెలరోజుల సప్త ముగింపు రోజు వందలాది భక్తులకు అన్నదానం చేపట్టిన రామ్ పటేల్
నవతెలంగాణ -మద్నూర్
ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర కర్ణాటక మూడు రాష్ట్రాలకు పూర్తిగా సరిహద్దులో గల మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయానికి బుధవారం నాడు సమస్య రోజున మూడు రాష్ట్రాల భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి దర్శించుకున్నారు. ఈ ఆలయంలో అధిక మాసం సందర్భంగా నెల రోజుల నుండి సప్త భజన కీర్తన ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం అమావస్య రోజుతో ఈ ఆలయంలో నెల రోజులుగా నిర్వహించిన సప్త కార్యక్రమం ముగిసింది ముగింపు రోజున భక్తుల కోసం మద్నూర్ మండలంలోని పెద్ద షక్కర్గ గ్రామ ఎంపీటీసీ అనూషబాయి కుమారుడు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు రామ్ పటేల్ ఆధ్వర్యంలో వందల సంఖ్యలో తరలివచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయంలో నెల రోజులపాటు రోజుకు ఒక భక్తుడు ముందుకు వచ్చి రోజువారి అన్నదానం నిర్వహించారు. ఈ ఆలయంలో చేపట్టిన భజన కీర్తన సప్త తో పాటు రోజువారి అన్నదాన కార్యక్రమం విజయవంతం కావడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నర్సింలు గౌడ్ సలాబత్పూర్ గ్రామ సర్పంచ్ షేక్ గఫర్ ఎంపీటీసీ సభ్యులు విజయ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ అధికారులు పాలకవర్గం సభ్యులు ప్రత్యేక వసతులతో విజయవంతం చేశారు. ముగింపు రోజు అమావాస్య బుధవారం నాడు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించిన రామ్ పటేల్ కు ఆలయ కమిటీ సభ్యులు ఆలయ అధికారులు పూజారులు ప్రత్యేకంగా ఆయనకు సన్మానించారు.

Spread the love