డ్రోన్ కెమెరాతో పక్కా బందోబస్త్..

– అంతరాయం లేకుండా వాహనాల రాకపోకలు 
నవతెలంగాణ -తాడ్వాయి : సమ్మక్క సారక్క జాతర ఇంకా 18 రోజులు మిగిలి ఉండగానే  అమ్మ వార్ల దర్శనానికి భక్తులు భారులు తీరారు. ఆదివారం నాడు మేడారం జాతరకు  మునుపేన్నాడు లేని విధంగా ఒక్క రోజే 6 లక్షల మంది భక్తులు జాతరకు విచ్చేసారు. కాగా పక్కా ప్రణాళికతో పూర్తి సంసిద్ధంగా ఉన్న పోలీస్ శాఖ 1000 మంది పోలీసులతో భారీ బందోబస్త్ ను సిద్ధం చేసారు. ఈ రోజు సుమారుగా   10000 వాహనాలు రాకపోకలు జరుపగా క్రమపద్దతిలో వాహనాలను మల్లించి పార్కింగ్ స్థలాలకు చేర్చడం జరిగింది.
జిల్లా ఎస్ పి డా. శబరిష్, సీసీటీవీ నిఘా నేత్రాల ద్వారా వాహనాల రాకపోకలను గమనిస్తూ  ఊరటం కాల్వపల్లి పార్కింగ్ స్థలాలకు వాహనాలు మల్లింపు,  గద్దెల ప్రాంగణాన్ని, జంపన్న వాగు వద్ద స్నాన ఘట్టాల  పరిసరాలను  మేడారం కంట్రోల్ రూమ్ నుండి  నిరంతరం పర్యవేక్షిస్తూ సిబ్బందికి ఎప్పటికప్పుడు వైర్లెస్ సెట్ లో సూచనలు చేస్తూ  13 ప్రధాన సెక్టార్లలో ట్రాఫిక్ క్రమబద్ధీకరించే  విదంగా  డ్రోన్ కెమెరా తో సమస్యత్మక ప్రాంతాలను ద్విచక్ర వాహనాల ద్వారా చేరుకొని పరిస్థితిని చక్క దిద్ది విజయవంతంగా బందోబస్తు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఓ ఎస్ డి అశోక్ కుమార్, ఏ ఎస్ పి ఏటూరునాగారం సిరిశెట్టి సంకీర్త్, డి ఎస్ పి ఎన్ రవీందర్, వివిధ జిల్లాల సిఐ లు, ఎస్ ఐ లు పాల్గొన్నారు.
Spread the love