సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా

– తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ధర్నా
– జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి
నవతెలంగాణ కంటేశ్వర్
తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, డి ఈ ఓ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడానికి జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి విచ్చేసిన ఎమ్మెల్సీ కవిత గారినీ కలిసి సమస్యలను విన్నవించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండగంగాధర్, జిల్లా అధ్యక్షురాలు చామంతి లక్ష్మి మాట్లాడుతూ ఈ నెల 12 నుండి బడులు ప్రారంభమవుతున్న సందర్భంగా విద్యాశాఖ అధికారులు మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్లో ఉన్న బిల్లుల గురించి ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు, జిల్లా వ్యాప్తంగా ఎనిమిది కోట్ల రూపాయలు పెండింగ్లో ఉంటే, ఏదో కంటి తుడుపు చర్యగా రెండు కోట్లు విడుదల చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులను మభ్యపెట్టడం సరికాదు ఉన్నారు, మిగిలిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు, అరకొరబడ్జెట్ను ఇవ్వడం ద్వారా బడులు ప్రారంభమవుతున్న సందర్భంగా డబ్బులు లేక కార్మికులు విలవిలాలాడుతున్నారు. పూర్తి విడుదల చేస్తే గాని చేతిలో డబ్బులు ఉండక ఏం చేయాలో కోల్పోయాక అదేవిధంగా కొత్త మేను ప్రకారము వంట చేయలని, ఇప్పుడే బడిబాటలున్న ఉపాధ్యాయులు ఒత్తిడి చేస్తున్నారని అన్నారు, ఈ సందర్భంగా అధికారులను అడగడం ఏమనగా పూర్తి బడ్జెట్ విడుదల చేస్తేనే గాని వంటకు సాధ్యం కాదు కాబట్టి దీన్ని గమనంలో ఉంచుకొని పూర్తి బడ్జెట్ ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది 12 తారీఖు నాడు పూర్తి బడ్జెట్, వచ్చే ప్రయత్నం గా మేము ప్రయత్నిస్తామని హామీ ఇవ్వడం ద్వారా ధర్నాను విరమించి రావడం జరిగింది డిమాండ్లు ఒక విద్యార్థికి 15 రూపాయలస్లాబ్రేరేటు ఇవ్వాలని పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే విడుదల చేయాలని కార్మికులుగా గుర్తించాలని ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని వంటచేడ్లు వంట పాత్రలు తక్షణమే ఇచ్చే ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో చామంతి లక్ష్మీ జిల్లా అధ్యక్షురాలు జక్రాన్ పల్లి స్వప్న, కాలూరు వనిత సుజాత, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు కృష్ణ, కార్మికులు పాల్గొన్నారు.

Spread the love