లేబర్ ఆఫీస్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా

Dharna under CITU in front of Labor Officeనవతెలంగాణ – కంఠేశ్వర్ 
గుత్ప, అలీ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు గత ఐదు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు గత 20 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ అధికారులు, కాంట్రాక్టర్ స్పందించకపోవడం తో శనివారం జిల్లా లేబర్ ఆఫీస్ ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించి తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం లేబర్ అధికారి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ..కార్మిక సమస్యల పట్ల ఇరిగేషన్ అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించకుండా కార్మికఁల  వేతనాలను చెల్లింప చేయటంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించటాన్ని   ఖండించారు. కార్మిక హక్కులను కాపాడాల్సిన అధికారులే నిర్లక్ష్యం చేయటం సమాజ హితానికి సరైనది కాదని ఆయన హెచ్చరించారు.  కార్మికుల వేతనాలను అడిగితే కాంట్రాక్టర్ బిల్లులు రాలేదని సాక్ చెబుతున్నారని, బిల్లులకు వేతనాలకు ముడి పెట్టడం ఏరకంగా సరైంది ఆలోచించాలని ఇది పూర్తిగా తప్పించుకోవటానికి ఉపయోగపడే మార్గం అని  అధికారులు ఇదే వైఖరిని ప్రదర్శిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఇరిగేషన్ అధికారులను కాంట్రాక్టర్ను లేబర్ అధికారులు చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికులు గణేష్, మైపాల్, కార్తీక్, బుచ్చన్న, అజయ్, సందీప్, ప్రవీణ్, రవి తదితరులతోపాటు వివిధ పంప్ హౌస్ ల నుండి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Spread the love