డయల్ 100 కాల్ కు నిర్లక్ష్యం వహించిన ఎస్ఐపై వేటు 

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
డయల్ 100 కాల్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ ఎస్సైపై వేటు పడింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐదవ పోలీస్ స్టేషన్ ఎస్సై అశోక్ ను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. టౌన్ పరిధిలో జరిగిన ఒక ఘటనకు సంబంధించి 100 ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ ను సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్ఐ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సీపీ గుర్తించారు. అందుకే 5 వ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో బాధ్యతల నుంచి తప్పించారు. అయితే ఈయన గతంలోనూ రెండో టౌన్ ఎస్సైగా పనిచేసిన సమయంలో కూడా ఇలాగే హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ అయ్యారు. దీంతో రెండోసారి తన విధులలో నిర్లక్ష్యం వహించారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎవరైనా తమ విధులకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సీరియస్గా చర్యలు ఉంటాయని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ వెల్లడించారు.
Spread the love