
మండలంలోని జంగంపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిల్డ్రన్స్ డే సందర్భంగా గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, ప్రస్తుత సొసైటీ డైరెక్టర్ బాల్ నర్సవ్వ, మాజి వార్డు మెంబర్ రామస్వామి బాలనర్సవ్వ పెళ్లిరోజు సందర్భంగా 228 మంది విద్యార్థులకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి చేతుల మీదుగా పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎలకాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు నరేష్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు ఉన్నారు.