అశ్విని హాస్పిటల్ అధ్వర్యంలో పస్ట్ ఎయిడ్ కిట్స్ పంపిణీ

నవతెలంగాణ – వీర్నపల్లి 
వీర్నపల్లి మండలం అడవి పదిర, రంగంపేట, గర్జన పల్లి, వన్ పల్లి, పలు గ్రామాల్లో మహాత్మ గాంధీ జాతీయ ఉపాధిహామీ కూలీలకు ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లను గురువారం అశ్విని హాస్పిటల్ వైద్యులు జి సత్యనారాయణ స్వామి, మేనేజింగ్ డైరెక్టర్ అభినయ్ ఆదేశాల సహకారంతో హాస్పిటల్ సిబ్బంది అందించారు. ఉపాధి హామీ పనిచేస్తున్న  కూలీలకు ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరుగుతే ప్రథమ చికిత్స కొరకై తీసుకోవలసిన జాగ్రత్తలతో పాటు ప్రథమ చికిత్స ప్రమాదం జరిగినప్పుడు వెంటనే వైద్యం చేసుకునే విధంగా పష్ట్ ఎయిడ్ కిట్స్ ను అందించామని వీటిని ఉపయోగించుకోవాలని కూలీలకు హాస్పిటల్ యాజమాన్యం సూచించారు. ఈ కార్యక్రమంలో కరోబార్ సురేష్, ఫీల్డ్ అసిస్టెంట్ రాజు, మెట్స్ కూలీలు ఉన్నారు.
Spread the love