వరద బాధితులకు వంట సామాగ్రి పంపిణీ

నవతెలంగాణ-గోవిందరావుపేట
టి డబ్ల్యూ జేఏసీ ఐటీడీఏ ఏటూరునాగారం ఆధ్వర్యంలో శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల ఆర్ధిక సహకారంతో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా సంభవించిన వరదలకు తీవ్రంగా నష్టపోయిన ప్రాజెక్ట్ నగర్, తప్పమంచ గ్రామాల 74 బాధిత కుటుంబాలకు 70,000 రూపాయల విలువైన వంటసామాగ్రి ( అల్యూమినియం బకెట్ -1, వంటపాత్రలు -2, అన్నం పల్లాలు -2, గరిటలు – చెంబు -1, చాప -1) అందజేయడం జరిగింది.ఇట్టి సామాగ్రిని ఆశ్రమ పాఠశాలల మరియు ప్రాధమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సమక్షంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ పంపిణీ కార్యక్రమంలో టీ డబ్ల్యూ జేఏసీ స్టేట్ చైర్మన్ యల్ శ్రీరాములు , ఐటీడీఏ స్థాయి చైర్మన్ కే శ్రీనివాస్ , సెక్రటరీ జనరల్ కే చెంచయ్య కో చైర్మన్ జే రవి, ప్రధానోపాధ్యాయులు యం నాగేశ్వర్ రావు, కల్తి శ్రీనివాస్, ఏ సి ఎం ఓ. కే రవీందర్, పీ గాంగు, బి సాయిబాబా, డి రేవతి, వీ సారంగపాణి పులసం శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Spread the love