Tuesday, May 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ చీరల పంపిణీ

ఇందిరమ్మ చీరల పంపిణీ

- Advertisement -

 నవతెలంగాణ –  కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలో 14వ వార్డ్ పరిధిలో ఇందిరమ్మ చీరెలను స్థానిక కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత మంగళవారం పంపిణీ చేశారు. కాలనీ ప్రభుత్వ ప్రైమరి పాఠశాలలో 14వార్డ్ మహిళలకు, డ్వాక్రా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  మహిళల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసేలా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. మూడు రోజుల పాటు 14వ వార్డ్ మహిళలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు సబ్బని కృష్ణహరి, కాంగ్రెస్ నాయకులు మీసాల గంగారాం, మెహెర్ బాబా గౌడ్, కృష్ణ రెడ్డి, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -