ఎండలో పనిచేస్తున్న కార్మికులకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ

నవతెలంగాణ – ఏర్గట్ల
ఏర్గట్ల పి.హెచ్.సి కి చెందిన వైద్యులు సోమవారం ఏర్గట్ల,తాళ్ళ రాంపూర్,నాగేంద్ర నగర్ గ్రామాలను సందర్శించారు.ఎండలో పనిచేస్తున్న కార్మికులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రిపోర్టింగ్ ఆఫీసర్ ఆకుల మారుతి మాట్లాడుతూ…ఉష్ణోగ్రత రోజురోజుకు పెరుగిపోతుందని,ఎండలో పనిచేసే కార్మికులు వడ దెబ్బ తగలకుండ  లీటర్ నీటిలో 5 చెంచాల ఓఆర్ఎస్ పౌడర్ కలుపుకుని తాగాలని,నీడలో మాత్రమే పనిచేస్తూ…ధారాళంగా నీటిని త్రాగాలని కోరారు.వడదెబ్బ తగిలినప్పుడు మనిషికి జ్వరం రావడం,నోరు తడారి పోవడం,కండ్లు మూతలు పడడం,మూత్ర విసర్జన తగ్గిపోవడం జరుగుతుందని అన్నారు.ఇది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు,వృద్ధులకు,పిల్లలకు ,రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారికి తగిలే అవకాశాలున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పండరీ,సుమ,కల్పన,శ్యామల, ఆశాలు పాల్గొన్నారు.
Spread the love