మండలంలోని బొమ్మకల్ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు రోటరీ క్లబ్ వరంగల్ సహకారంతో టై, బెల్ట్ లు ప్రధానోపాధ్యాయురాలు లీలా శోభారాణి చేతుల మీదుగా బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోటరీ క్లబ్ వరంగల్ సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. వారు పాఠశాలకు అందిస్తున్న సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు టై, బెల్ట్ లు, ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్స్ అందిస్తున్నారని చెప్పారు. వీటితో పాటు విద్యార్థులకు 10 సైకిళ్ళు కూడా బహుకరించారని తెలిపారు. విద్యార్థులు దాతలు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం రోటరీ క్లబ్ వరంగల్ అధ్యక్షుడు రాజగోపాల్, కార్యదర్శి వేణు కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.