పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని విధిగా అమలు చేయాలి : డీఎంహెచ్‌వో

నవతెలంగాణా-మట్టెవాడ
పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని విధిగా తప్పకుండా అమలు చేయాలని జిల్లా వైద్య ఆ రోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సాంబశివరావు అడ్వైజరి కమిటీకి సూచించారు. గర్భస్త పూర్వ పిండలింగ నిర్ధారణ చట్టంపై జిల్లా స్థాయి అడ్వైసరీ కమిటీ సమావేశం శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో డాక్టర్‌. బి. సాంబశివ రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడు తూ గర్భిణీ స్త్రీలు పరీక్షల కోసం ఆసుపత్రిలకు వచ్చినపుడు అన్ని ఆరోగ్య పరమైన జాగ్రత్తలతో పాటుగా అమ్మాయిలను, అబ్బాయిలను ఎటు వంటి వివక్ష చూప కుండా సమానంగా ఆదరించాలని అన్నారు. అలాగే పీసీపీఎన్‌డీటీ చట్టం గురిం చి ఆరోగ్యసిబ్బంది ద్వారా గర్భిణీలకు అవగాహన కల్పిస్తామని ఆయన తెలి పారు. పోలీసు శాఖా, వైద్య ఆరోగ్య శాఖా కలసి నిర్వహించిన డెకారు ఆపరేషన్‌ పై చర్చించడం జరిగిందని ఇక ముందు కూడా అన్నిశాఖల సమన్వయంతో డెకా రు ఆపరేషన్‌ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అప్పటికే ఆడ సంతానం కలిగి ఉండి తిరిగి గర్భం వచ్చిన వారి పైన ప్రత్యేక శ్రద్ద చూపుతూ స్వచ్ఛంద సం స్థలు, ఐసిడిఎస్‌, ఐకెపి, మెప్మా వారితో కలసి గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో అవ గాహన కార్యక్రమంతో పాటు స్కానింగ్‌ సెంటర్‌లపై నిఘా పెంచుతామన్నారు. జిల్లాలోని అన్ని స్కానింగ్‌ సెంటర్‌ లోని ఓపి విభాగంలో సీసీటీవీ లు అమర్చుకొని ఆ యొక్క ఫుటేజ్‌ ని అధికారులకు అవసరమైనప్పుడు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు సూచించారు.
ప్రతి డాక్టర్‌ పిఎన్‌డిటి చట్టం, ఎంటిపి చట్టం నిబంధనలు కచ్చితంగా పాటిం చాలని, పిఎన్‌డిటికి ఏ డాక్టర్‌కైతే అనుమతిని ఇవ్వడం జరుగుతుందో వారే స్కా నింగ్‌ నిర్వహించాలన్నారు. అలాగే ఎంటిపి చట్టం కింద అనుమతి పొందిన ఆసు పత్రులు ఖచ్చితంగా నియమాలకు అనుగుణంగా అనుమతించిన పరిస్థితుల్లో మాత్రమే అబార్షన్లు నిర్వహించాలని పూర్తి వివరాలను నమోదు చేయాలన్నారు. స్వంత వైద్యం, అర్హతలేని వైద్యుల దగ్గరకు వెళ్లకుండా ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి హనుమకొండలో నిపుణులను సంప్రదించాలన్నారు. చట్టం ఉల్లంఘిస్తున్న వారి వివరాలు 104,1098 లేదా డయల్‌ 100కితెలియచేయాలన్నారు. ఈ సమావే శంలోడిప్యూటీ డిఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎండి.యాకూబ్‌పాషా, గైనకాలజిస్ట్‌ లు డాక్టర్‌ వై.పద్మ, డాక్టర్‌ ఏ.నిరంజనిదేవి, లీగల్‌ అడ్వైజర్‌ రేవతి దేవి, సర్వోదయ ప్రతినిధి ఎస్‌.కవిరాజ్‌, ఎఫ్‌ఎంఎం సంస్థ నుండి కరుణ, ఇ.శ్రీకాంత్‌, జిల్లా మాస్‌మీడియా అధికారి వి.అశోక్‌ రెడ్డి, ఎస్‌ఒ ప్రసన్న కుమార్‌, కె.ప్రసాద్‌లు పాల్గొన్నారు.

Spread the love