తాండూరుకు నిధుల వరద

రోడ్లకు మరో రూ.20.20 కోట్లు
ఖంజాపూర్‌ గేటు నుండి విలియమూన్‌ వరకూ రోడ్డు డ్రైన్‌ నిర్మాణం
పాల కేంద్రం నుంచి అంతరం ఘాట్‌ వరకు నాలుగు వరుసల రోడ్డు
జీవో 237 జారీ చేసిన ఆర్‌అండ్‌బి శాఖ
ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి కృషి ఫలితం
నవతెలంగాణ-తాండూరు
తాండూరు పట్టణంలోని ప్రధాన రోడ్లతో పాటు తాం డూరులోకి వచ్చే ప్రధాన రోడ్డు మార్గాలను అభివృద్ధి చే సేందుకు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి చేస్తున్న కృషి ఫలించింది. తాండూరు పట్టణ కేంద్రంలో ఇప్పటికే బస్టాండ్‌ నుంచి సెయింట్‌ మర్క్స్‌ పాఠశాల వరకు విస్తరించి అభివృద్ధి చేసిన రోడ్డుకు ఇరు వైపులా బీటీ రోడ్డు నుంచి వర్షపు నీటి డ్రైన్‌ వరకూ బీటీ రోడ్డు నిర్మాణంతో పాటు పట్టణ సుందరీకరణకు రూ.25 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. జీవో 217ని ఆర్‌ అండ్‌బీ శాఖ జారీ చేసింది. తాండూర్‌ పట్టణ కేంద్రంలోని హైదరాబాద్‌ రో డ్డు మార్గంలోని ఖంజాపూర్‌ నుంచి విలియ మూన్‌ వరకూ ఉన్న రోడ్డును అభివృద్ధి చేసి ఇరు వైపులా డ్రైన్‌ నిర్మాణానికి రూ.5.20 కోట్లు విడుదల చేసింది. అదేవిధంగా అంతారం రోడ్డు మార్గంలోని పాల కేంద్రం నుంచి అం తారం గ్రామం దాటిన తరువాత వచ్చే బైపాస్‌ రోడ్డు వరకు నాలుగు వరుసల రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించింది. ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి విజ్ఞప్తి మేరకు ఆర్‌అండ్‌బి శాఖ జీవో 237 జారీ చేసింది. తాండూరు పట్టణంలోకి వచ్చే ప్రధాన రోడ్ల అభి వృద్ధికి నిధు లు విడుదల చేసిన ముఖ్యమంత్రి కెేసీఆర్‌కు, ఆర్‌అండ్‌బి శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డికి ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love