వర్షపు నీరు నిలవకుండా జాగ్రత్త తీసుకోవాలి

– మియాపూర్‌ కార్పొరేటర్‌ ఉప్పలపాటి శ్రీకాంత్‌
నవతెలంగాణ మియాపూర్‌
వర్షపు నీరు నిలవకుండా జాగ్రత్తగా తీసుకో వాలని మియాపూర్‌ కార్పొరేటర్‌ ఉప్పలపాటి శ్రీకాంత్‌ అన్నారు. మియాపూర్‌ డివిజన్‌ పరిధిలోని ” నడిగడ్డ తండా నుండి బొల్లారం మెయిన్‌ రోడ్డు” వరకు వర ద నీటి కలువ నూతనంగా నిర్మాణం చెప్పటబోయే పరిసర ప్రాంతాలను జిహెచ్‌ఎంసి అధికారులతో కలసి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ రానున్న వర్షాకాలం దృష్టిలో వుం చుకొని వివిధ కాలనీ వాసులకు ఇబ్బందులు కలుగ కూడదని వరద నీటి కలువ, సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని, పలు కాలనీలలో ప్రజల నుండి వచ్చిన వినతితో ప్రత్యేక చొరవ తీసుకొని మియాపూర్‌ డివిజన్‌ లోనీ నదిగడ్డ తండా నుండి మియాపూర్‌ బొల్లారం మెయిన్‌ రోడ్డు వరకు నూతనంగా ఏర్పాటు పనులను పరిశీలించా మని తెలిపారు. ప్రజల సైతం ప్లాస్టిక్‌ వ్యర్థాలను రో డ్లపై పడవేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆ యన సూచించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి ఎఇ ప్రసాద్‌,వర్క్‌ ఇన్స్పెక్టర్‌ నవీన్‌, స్థానిక నాయకులు స్వామి నాయక్‌ , తిరుపతి నాయక్‌ , లక్పతి, సుధాకర్‌ , రాజు మరియు తదితరులు పాల్గొన్నారు.

Spread the love