బంట్వారంలో వచ్చిందే టైం.. చేసిందే డ్యూటీ

– సమయ పాలన పాటించని ఉద్యోగులు
– ఉదయం 10.35 దాటినా తాళం తీయని వైనం
– ఎంపీడీఓ కార్యాలయంలో ఇష్టానుసారంగా విధుల నిర్వహణ
నవతెలంగాణ-బంట్వారం
మండల పరిషత్‌ కార్యాలయంలో ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. వచ్చిందే సమయం.. చేసిందే డ్యూటీ అన్నచందంగా తయా రైంది. ఉదయం 10 గంటలకు కార్యాలయాన్ని తెరిచి ప్రజ లకు అందుబాటులో ఉండాలి. కానీ, సోమ వారం ఉదయం 10:35 దాటినప్పటికీ మండల పరి షత్‌ కార్యాలయం తాళం తీయకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఉద్యోగులు సమయపాలన పాటిం చాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ప్రతిష్టాత్మకంగా జియో అటెండెన్స్‌ను తీసుకొచ్చారు. అయినప్పటికీ అధికారుల్లో మార్పు రావడం లేదు. నిత్యం ఇలానే సమయపాలన పాటించకుండా కార్యాలయానికి వస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఉద్యోగులు సమయ పాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Spread the love