వీధి కుక్కల దాడిలో 200 నాటు కోళ్లు మృత్యువాత

రూ.95 వేల నష్టం
గతంలోనూ ఇదే ఘటన
నవతెలంగాణ-మర్పల్లి
వీధి కుక్కల దాడిలో రెండు వందల నాటు కోళ్లు మృతి చెందాయి. మండలంలోని పంచలింగాల్‌ గ్రామంలో గ్రామంలో సోమవారం వీధి కుక్కల దాడిలో 200 నాటు కోళ్లు మృతి చెందినట్లు బాధితుడు పరిగి సుభాన్‌ తెలిపా రు ప్రభుత్వం దళితులకు బతుకుతెరువు కోసం 200 నాటుకోడి పిల్లలు ఇచ్చారని సొంత ఖర్చులతో రూ.15 వేలతో రేకుల షెడ్డు నిర్మించి చుట్టూ కబూతర్‌ జాలి ఏర్పాటు చేశామని రూ.12 వేల దాన తెచ్చామన్నాడు. సోమవారం 4 వీధి కుక్కలు జాలి కింద భూమిని తవ్వి షెడ్డులోకి దూరి కోళ్లను దాడి చేసి చంపాయని ఒక్కో కోడి సుమారు కిల కిలనర వరకు బరువు వచ్చాయని రూ.95,000 నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి రాత్రి పగలనక పెంచుకున్న నాటు కోళ్లను ఒకటి మిగలకుండా చంపాయని గతంలోనూ తన 3 మేకపిల్లల పై, గొల్ల నాగేష్‌కి చెందిన 2 మేక పిల్లలు, మే తరి దానయ్య ఒక మేకపై దాడి చేశాయని తెలిపారు. గ్రా మంలో సుమారు 15 వీధి కుక్కల గుంపు సంచరిస్తోందని చిన్నపిల్లలు వీధుల్లోకి రావాలంటే తల్లిదండ్రులు భయాం దోళనకు గురవుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు గతంలో ఫిర్యాదు చేసినా ప్ర యోజనం లేకుండా పోయిందని ఇప్పటికైనా అధికారులు వీధి కుక్కలను అరికట్టాలని ఆయన కోరారు.

Spread the love