ప్రయివేట్‌ పాఠశాలల్లో బుక్స్‌, యూనిఫాంలు విక్రయిస్తే చర్యలు తీసుకోవాలి

ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్‌ అధ్యక్షులు
బేగరి అరుణ్‌కుమార్‌
నవతెలంగాణ-షాబాద్‌
ప్రయివేట్‌ పాఠశాలల్లో బుక్స్‌, యూనిఫాంలు అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్‌ అధ్యక్షులు బేగరి అరుణ్‌ కుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం మండల పరిధిలోని నాగల్గూడలో అక్షర టాలెంట్‌ స్కూల్లో బుక్స్‌, యూనిఫాంలు అమ్ముతున్న వాటిని పట్టుకుని మండల విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్‌-1 విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రయివేట్‌ పాఠశాలల్లో బుక్స్‌, యూనిఫాం విక్రయించరాదన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో అనేక తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు. ప్రయివేట్‌ పాఠ శాలల్లో అధిక ఫీజులు నియంత్రించాలని హెచ్చ రించారు. విద్యాశాఖ అధికారులు ప్రతీ ప్రయివేట్‌ పాఠశాలను తనిఖీ చేసి, చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా ఫిట్నెస్‌ లేని బస్సులను గుర్తించి, వాటిని మరమ్మతులు చేపట్టా లన్నారు. లేనియేడలా డీఈవో కార్యాలయాన్ని ముట్టడి స్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గణేష్‌, మని, సాయిరాం, విగేష్‌ తదితరులు ఉన్నారు.

Spread the love