విద్యార్థులు లక్ష్యంతో ఉన్నత స్థాయికి ఎదగాలి

శంకర్‌పల్లి యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రామచంద్రయ్య లక్ష్మినారాయణ
నవతెలంగాణ-శంకర్‌పల్లి
విద్యుర్థులందరూ లక్ష్యంతో చదువుకుని, ఉన్నత స్థాయికి ఎదగాలని శంకర్పల్లి యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రామచంద్రయ్య, లక్ష్మీనారాయణ అన్నారు. శంకర్పల్లి బాలుర పాఠశాలలో, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆర్థిక అక్షరా స్యత, ఆర్థిక సమీకృతం, అభివృద్ధి విభాగం పై మంగళ వారం క్విజ్‌ కాంపిటీషన్‌ నిర్వహించారు. ఈ క్విజ్‌ కాంపిటీ షన్‌లో శంకర్పల్లి మండలంలోని 12 పాఠశాలలు పాల్గొ నడం జరిగింది. అందులో ప్రథమ బహుమతి జడ్పిహె చ్‌ఎస్‌ టంగుటూరు విద్యార్థులు టి. శ్రావణి ఎం. రుచిత లు, రెండోవ బహుమతి జెడ్‌ పిహెచ్‌ఎస్‌ బార్సు శంకర్పల్లి విద్యార్థులు వి.వంశీ, వి. గణేష్‌,లు తృతీయ బహుమతి, జడ్పిహెచ్‌ఎస్‌ జనవాడ విద్యార్థులు ఎన్‌. సాయిరాం, రామా రావులు బహుమతులు గెలుపొందారు. ఈ కార్య క్రమం లో బ్యాంకు సిబ్బంది సోమలింగం, బాలుర స్కూల్‌ ప్రధానో పాధ్యాయులు లక్ష్మయ్య, కవ్వ గూడెం శీను , కృష్ణ య్య, టంగుటూరు, కొండకల్‌, ప్రధానోపాధ్యాయులు జయ సింహారెడ్డి, విద్యాకర్‌, స్వర్ణలత, శ్రీనివాస్‌, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love