కలబందతో

అందం, ఆరోగ్యం…

ప్రతి ఇంట్లో కలబందను పెంచుకుంటూనే ఉంటాం. ఈ మొక్క చాలా సులువుగా, నీడలో కూడా పెరుగుతుంది. దీనిని అందానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటార. దీని వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి. ఇందులో నీటిని పీల్చుకునే గుణం ఎక్కువగా వుంది. ఉదయం పరకడుపున కలబందను తింటే ఉదర సంబంధ సమస్యలు తొలగిపోతాయి. కలబంద రసాన్ని ముఖానికి పట్టిస్తే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. చర్మంపై ఎక్కడైనా కాలిన గాయాలైతే కలబంద రసాన్ని వాటిపై పూతలా పూస్తే గాయాలు త్వరగా తగ్గుతాయి.
కలబంద రసంలో కొద్దిగా కొబ్బరి నూనె పోసి కలుపుకుని, ఆ మిశ్రమాన్ని మోచేతులు, పాదాల వద్ద నల్లగా ఉన్న ప్రాంతాల్లో పూతలా అప్లై చేసి కాసేపటి తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే చర్మంపైనున్న నల్లటి మచ్చలు తొలగిపోతాయి.
పొడి చర్మానికి
రోజ్‌ వాటర్‌లో కలబంద రసాన్ని కలుపుకుని ఈ మిశ్రమాన్ని చర్మంపై పూస్తే ఫలితం ఉంటుంది.
కలబంద రసంలో ముల్తానీ మట్టి లేక చందపు పొడి కలుపుకుని మొటిమలకు పూస్తే మొటిమలు పోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.

Spread the love