కొంతమంది మాట్లాడుతుంటే నోటి నుండి దుర్వాసన వస్తుంటుంది. తిన్న ఆహారం లేదా ఇతర పదార్థాలు నోటిలో మిగిలి అలాగే ఉండిపోవడమే దీనికి కారణం. అందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే చెక్ పెట్టవచ్చు. అవేంటంటే…
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కల్లుప్పు వేసుకుని కలిపి దానిని రోజులో రెండు మూడు సార్లైనా పుక్కిలించాలి. ఆహారం తీసుకున్న తర్వాత ఇలా చేస్తే నోరు శుభ్రమవతుంది. దుర్వాసన కూడా వుండదు. రోజులో కనీసం రెండు మూడు లవంగాలు, సోంపు వంటివి తింటుండాలి. ఇందులో ఉండే మంచి లక్షణాలు నోట్లోని బ్యాక్టీరియాను దూరం చేస్తాయి.
కొంచెం మిరియాల పొడి, పసుపు, కాస్త ఉప్పు, అందులో నువ్వుల నూనె వేసి పేస్టులా చేసుకుని ఈ పేస్ట్‌తో పళ్లను తోమితే నోటి దుర్వాసన వుండదు. తద్వారా పంటి సమస్యలు తీరడంతో పాటు నోటి దుర్వాసనా తగ్గుతుంది. అంతేకాదు, నిమ్మరసంతో బ్రష్ చేయడం వల్ల దుర్వాసనను తగ్గించుకోవచ్చు.
రోజులో రెండు సార్లు బ్రష్ చేయడం అలవాటు చేసుకోవాలి. టూత్ బ్రష్‌లను రెండు మూడు నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. నోట్లోని చెడు వాసనకు కారణమైన బ్యాక్టీరియాను తరిమేందుకు సహజసిద్ధమైన మౌత్ వాష్‌లను వినియోగించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు.