డార్క్‌ స్పాట్స్‌కు బార్లీ…

బార్లీ కాస్త వగరుగా, కాస్త తియ్యగా ఉండి చలువ చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి. వేసవి వచ్చిందంటే బార్లీ గింజలను విరివిగా వాడుతుంటారు. ఇవి బరువు తగ్గించడంలో, బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ను కంట్రోల్‌ చేయడంలో ఉపయోగపడతాయి. అలసట, నీరసం వంటి సమస్యలను దూరం చేస్తాయి. కిడ్నీలో రాళ్లను కరిగించడంలోనూ వీటి పాత్ర కీలకం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విధాలుగా బార్లీ గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటిని ఆరోగ్యంతో పాటు చర్మ సంరక్షణకు కూడా ఉపయోగించ వచ్చట. ముఖ్యంగా డార్క్‌ స్పాట్స్‌ను తగ్గించడంలో ఇవి చాలా ఎఫెక్ట్‌గా పని చేస్తాయట. మరి వాటిని చర్మ సంరక్షణకు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందామా…
బార్లీ గింజలను పొడి చేసుకుని, అందులో ఓట్స్‌ పొడి, రోజ్‌ వాటర్‌ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని డార్క్‌ స్పాట్స్‌ ఉన్న చోట అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. అనంతరం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే డార్క్‌ స్పాట్స్‌ క్రమంగా తగ్గిపోతాయి.
ఒక బౌల్‌లో బార్లీ గింజల పొడి, కొద్దిగా నిమ్మ రసం వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పావు గంట పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రంగా రుద్దుతూ కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డార్క్‌ స్పాట్స్‌తో పాటు చర్మంపై మతకణాలు కూడా తొలగిపోయి, ముఖం అందంగా మారుతుంది.
బార్లీ గింజలను నీటిలో వేసి నానబెట్టుకుని పేస్ట్‌ చేసుకోవాలి. ఈ పేస్ట్‌లో కొద్దిగా తేనె వేసి కలిపి ముఖానికి పట్టించాలి. బాగా ఆరిన తర్వాత కొద్దిగా నీళ్లు చల్లి వేళ్లతో స్క్రబ్‌ చేసుకుంటూ శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డార్క్‌ స్పాట్స్‌ తొలగిపోయి ముఖం కాంతివంతమవుతుంది.

Spread the love