ఇవి ఫ్రిజ్‌లో పెడుతున్నారా..?

ఈ రోజుల్లో ఫ్రిజ్‌ లేని ఇల్లు ఉండదు. అందులోనూ వేసవి కాలం అయితే మంచినీటి దగ్గర నుంచి తినే పదార్థాల వరకు అందులో పెట్టాల్సిందే. కొన్ని వస్తువులకు ఫ్ర్రిజ్‌ అవసరమే. అయితే కొన్ని ఆహార పదార్ధాలు మాత్రం ఫ్రిజ్‌లో పెడితే విషతుల్యం అవుతాయి. అవేంటో తెలుసుకుందాం…
పుచ్చకాయ : వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం పుచ్చకాయ తింటుంటాం. అవసరాన్ని బట్టి ఒకేసారి రెండు మూడు ఇంటికి తీసుకువస్తూ ఉంటాం. అయితే కోయని పుచ్చకాయల్ని ప్రిజ్‌లో పెట్టవచ్చు. కానీ కోసిన తర్వాత వాటిని డైరెక్ట్‌గా ఓపెన్‌గా ప్రిజ్‌లో పెట్టకూడదు. ఒక వేళ చల్లదనం కోసం పెట్టాలనుకుంటే ఏదైనా మూత ఉన్న బాక్స్‌లో పెట్టి పెట్టుకోవచ్చు.
ఉల్లిగడ్డలు : వంట చేసేపుడు కొన్ని సందర్భాలలో అవసరానికి మించి ఉల్లిగడ్డలు కట్‌ చేస్తుంటాం. వాటిని మళ్ళీ ఉపయోగించవచ్చని ఫ్రిజ్‌లో దాస్తాం. ఇలా చేయడం వల్ల ఫ్రిజ్‌లో ఉండే ఇతర ఆహార పదార్థాలు చెడిపోతాయి. అందువల్ల తరిగిన ఉల్లిగడ్డలను ఫ్రిజ్‌లో పెట్టకపోవడమే ఉత్తమం.
ఆలూ : చల్లటి ప్రదేశంలో లేదా ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల ఆలుగడ్డలో ఉండే చెక్కర శాతం పెరుగుతుంది. దీని వల్ల కూర రుచి మారుతుంది.
తేనె : ఎన్ని ఏండ్లయినా చెడిపోని ఆహార పదార్థం తేనె. దీనిని ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల రుచి మారుతుంది.
అరటి పండ్లు : అరటి పండ్లలో ఎంజైమ్స్‌ ఉంటాయి. వీటిని ఫ్రిజ్‌లో ఉంచితే ఈ ఎంజైమ్స్‌ తగ్గిపోతాయి. దీనితో అరటి పండ్లు త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది.
పువ్వులు : పువ్వుల వాసన వల్ల ఫ్రిజ్‌లో ఉండే ఇతర ఆహార పదార్థాలకు ఆ వాసన పడుతుంది. ఫలితంగా వాటిని తినలేం.
పచ్చళ్ళు : కాలానికి తగ్గట్లు పచ్చళ్ళు పెడుతూనే ఉంటారు. ఇవి చెడి పోకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కానీ వాటిని ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల చల్లదనానికి త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది.
బ్రెడ్‌ : బ్రెడ్‌ పాకెట్‌ ఓపెన్‌ చేసి తిన్నాక మిగిలినది తాజాగా ఉండాలని ఫ్రిజ్‌లో పెడుతుంటారు. ఓపెన్‌ చేసి పెట్టడం వల్ల బ్రెడ్‌ గట్టి పడిపోతుంది. అందువల్ల కవర్‌ మూసి పెట్టాలి.

Spread the love