ఇవి తింటే అనారోగ్యాలే…!

ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించడం మర్చిపోతున్నాం. కానీ ఆరోగ్యంగా ఉండాలన్నా, ఇన్‌ఫెక్షన్లతో సమర్థవంతంగా పోరాటం చేయాలన్నా రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండటం చాలా ముఖ్యం. ఇలాంటి ఆహారం శరీరానికి పోషణ అందించి, మనం పని చేయడానికి శక్తిని అందించేలా చేస్తాయి. అటువంటి ఆహారమే హానికరమైన వైరస్‌లు, బ్యాక్టీరియా, క్రిములు, ఇన్‌ఫెÛక్షన్‌ల నుంచి మనల్ని రక్షిస్తుంది. రోగనిరోధక శక్తిని మెరుగు పరుస్తుంది. అయితే కొన్ని ఆహార పదార్థాలు పరిమితికి మించి నిత్యం తింటుంటే ఆరోగ్యానికి, రోగనిరోధక వ్యవస్థకు హాని కలుగుతుంది. వీటికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. మరి మనం తినకూడని ఆ ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం?
న కెఫిన్‌ ఉన్న పానీయాలు ఎక్కువగా తీసుకుంటే.. శరీరం ఐరన్‌, కాల్షియం వంటి ఖనిజాలను గ్రహించే సామర్థ్యం కోల్పోతుంది. రోగనిరోధక వ్యవస్థకు ఇవి చాలా ముఖ్యం. కెఫిన్‌ ఎక్కువగా తీసుకుంటే నిద్రకు భంగం కలుగుతుంది. ఇది కాలక్రమేణా రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది.
న పంచదార ఎక్కువగా తింటే రోగనిరోధక శక్తి బలహీనపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను కలిగిస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. చీజదీ× నివేదిక ప్రకారం, స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల అధిక బరువు, గుండె, డయాబెటిస్‌ వంటి సమస్యలు ఎదురవుతాయి.
న నిల్వ చేసే మాంసంను క్యూరింగ్‌, సాల్టింగ్‌, స్మోకింగ్‌, డ్రైయింగ్‌, క్యానింగ్‌ పద్ధతి ద్వారా భద్రపరుస్తారు. ఇటువంటి మాంసంలో సంతప్త కొవ్వు, సోడియం, రసాయనాలు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తాయి. సాసేజ్‌లు, హాట్‌ డాగ్‌లు, సలామీ వంటి ప్రాసెస్‌ చేసిన మాంసాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
న శుద్ధి చేసిన పిండి పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఇది శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌కు దారితీస్తుంది. అలాగే వైట్‌ బ్రెడ్‌, మైదా, ఆలూ చిప్స్‌ వంటి వాటికి దూరంగా ఉండాలి.
న ఆల్కహాల్‌ ఎక్కువగా తాగితే.. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. తద్వారా ఇన్‌ఫెక్షన్లు వచ్చే ముప్పు ఎక్కువ అవుతుంది. ఆల్కహాల్‌ ఊపిరితిత్తులను రక్షించే రోగనిరోధక కణాలను ప్రభావితం చేస్తుంది. ఊపిరితిత్తుల నుంచి శ్లేష్మం తొలగించే సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంది. ఇన్‌ఫెక్షన్‌ల నుంచి శరీరాన్ని రక్షించే.. తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేసే శరీర సామర్థ్యానికి కూడా ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి దీనికి పూర్తిగా దూరంగా ఉండడం ఆరోగ్యానికి చాలా మంచిది.

Spread the love