అన్నా చెల్లెళ్ళ అనుబంధం నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చి, ప్రేక్షకుల విశేష ఆదరణతో విజయవంతమైన చిత్రాలుగా నిలిచాయి. అలాగే బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్‌తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మా ‘భోళాశంకర్’ సినిమా సైతం ప్రేక్షకుల మనసుని గెలుచుకుంటుందనే నమ్మకం ఉంది’ అని అంటున్నారు మేకర్స్.
చిరంజీవి తాజాగా నటించిన మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటిస్తుండగా, చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ కనిపించనున్నారు.
రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు 14.5 మిలియన్ వ్యూస్‌తో ట్రైలర్ వీడియో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. చిరంజీవి స్వాగ్, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీ అభిమానులు, మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమాలో యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయని ట్రైలర్ ద్వారా అర్థమైంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే అంశాలూ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. అన్న చెల్లెళ్ళ బంధం సినిమాకు ప్రధాన ఆకర్షణ. అన్నా చెల్లెలుగా చిరంజీవి, కీర్తి సురేష్‌ల సీక్వెన్స్‌లు సినిమాకు బలంగా నిలుస్తాయి. వీరిద్దరూ బ్యూటీఫుల్ కెమిస్ట్రీని పంచుకున్నారు. ఈ రెండు పాత్రల మధ్య హ్యుమర్, డ్రామా, భావోద్వేగాలు ఉంటాయి. కాబట్టి, ఈ సినిమా కేవలం ఒక వర్గం ప్రేక్షకులకు పరిమితం కాదు. మాస్, యూత్, ఫ్యామిలీస్‌ని సమానంగా ఆకట్టుకునే సినిమాగా ఉంటుంది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రతి కంటెంట్ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉంటుందని మేకర్స్ దీమా వ్యక్తం చేశారు. అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం, డడ్లీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆగస్టు 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.