ఆరోగ్యం కోసం రోజు వారీ చేసే వ్యాయామాలు తగ్గిపోతుంటే మాత్రం కచ్చితంగా మన శరీరంలో మార్పులు గమనించుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఒత్తిడి పెరుగుతుంటుంది. ఇందుకు ప్రధాన కారణం ఆహారపు అలవాట్లలో మార్పులు చోటుచేసుకోవడమే… అంతేకాకుండా వయసుకు తగినట్టు శరీరంలో వస్తున్న మార్పులను సైతం గమనించాలి. శరీరంలో ఎంత శక్తి ఉత్పన్నమవుతుంది. ఎంత వరకు వినియోగమవుతుంది వంటివి పరిశీలించాలి. లేకుంటే భవిష్యత్‌లో జీవక్రియ, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
పోషకాహారం : ఈ మధ్యకాలంలో చాలామంది ఆహారంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. మంచి పోషకాహారాలను తీసుకుంటూ ఆరోగ్యంపై దష్టి పెడుతున్నారు. ఎక్కువ యాంటీ ఆక్సిడెట్లు, ఫైటోకెమికల్స్, ఖనిజ లవణాలు, విటమిన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఇవి ఆరోగ్యాన్ని మెరుగు పరచడమే కాకుండా వద్ధాప్యం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను నివారించగలుగుతాయని పరిశోధకులు సూతం సూచిస్తున్నారు. 30 ఏండ్లు పైబడిన వారు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి, రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి, ఒత్తిడి తగ్గించుకోడానికి ఈ సూపర్ ఫుడ్స్ తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
విటమిన్లు : మొక్కల నుంచి లభ్యమయ్యే విటమిన్లు తీసుకుంటే శరీరం బాగా గ్రహిస్తుంది. విటమిన్-సీ రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా మొత్తం ఆరోగ్యం సరిగ్గా ఉండేలా చూసుకుంటుంది.
ప్రోటీన్లు : వయసుతో పాటు ఆహారంలో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉండేట్టు చూసుకోవాలి. ముఖ్యంగా మొక్కల్లో దొరికే ప్రోటీన్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే వీటిని జీర్ణించుకోవడం సులభం. అంతేకాకుండా రుచితో పాటు ఎలాంటి దుష్ప్రభావాలు చూపవని పరిశోధకులు స్పష్టం చేశారు. ఇందుకు మంచి ఉదాహరణ బఠాణినే. మంచి ప్రోటీనే కాకుండా ఐరన్‌ను అందిస్తుంది. లాక్టోజ్ లోపం ఉన్నవారికి బఠాణీలు మేలు చేస్తాయి. వీటితోపాటు తృణ ధాన్యాలు, పాలు, సోయాలు శరీరానికి మంచి శక్తి వనరులుగా పనిచేస్తాయి.
తణ ధాన్యాలు, విత్తనాలు : మంచి పోషకాహారానికి చక్కని ఉదాహరణ తణ ధాన్యాలు. శతాబ్దాలుగా ఇవి పోషక కారకాలుగా పరిగణిస్తున్నారు. వయసు పైబడుతున్న కొద్ది ఆహారంలో తణ ధాన్యాలను చేర్చాలి. వీటి వల్ల గుండె పనీతరు, జీర్ణక్రియ బాగా పనిచేస్తాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఫైబర్, కాల్షియం, ఐరన్, పోటాషియం, పోషక ఆమ్లాలు లాంటి ఖనిజలవణాలు వీటిలో ఉంటాయి. తణ ధాన్యాలకు క్వినోవా మంచి ఉదాహరణ. ఇవి కాకుండా ఆహారంలో అవిసే గింజలు, జనపనార విత్తనాలు, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాలు చేర్చాలి. సలాడ్లు, పానీయాలతో కలిపి తీసుకోవడం లేదా పొడి రూపంలో తీసుకుంటే మంచిది.
ఆకుపచ్చని ఆహారం : ఆకుపచ్చని ఆహార పదార్థాలు శరీర పీహెచ్ స్థాయిని సరైన స్థితిలో ఉంచుతాయి. అంతేకాకుండా సరైన పోషకా లను అందిస్తాయని నిరూపితమయ్యాయి. ఇందులో ఆకు కూరలు, కొత్తిమీర లాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడటమే కాకుండా మీ శక్తి స్థాయిలను పెంచడానికి మీ దేహాన్ని సిద్ధం చేస్తాయి.