మార్కెట్లో ఏది దొరికితే అది కొనుక్కుని తినడం మంచిది కాదు.. ఎప్పుడు ఏ ఆరోగ్య సమస్య చుట్టుముడుతుందో చెప్పలేం. బయట తయారు చేసే పదార్థాల్లో కొన్ని నిల్వ చేసినవై ఉంటున్నాయి. అటువంటివి పూర్తిగా జీర్ణం కాకపోవచ్చు. అప్పటికి ఆ సమస్య పెద్దదిగా కనిపించకపోయినా దాని ప్రభావం తర్వాత తెలుస్తుంది. అజీర్తి, వాంతులు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదమూ లేకపోలేదు. ఇలాంటి ఫుడ్ తినడం వల్ల ఉబకాయ సమస్యలూ తలెత్తవచ్చు. అందుకే తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవటం ఉత్తమం. కొందరు కొన్ని రకాల పండ్లు, పానీయాలను వేసవికి మాత్రమే పరిమితం చేస్తుంటారు. అలా కాకుండా కాలంతో సంబంధం లేకుండా అందుబాటులో ఉండే పండ్లు, పానీయాలు తీసుకోవడం వల్ల శరీరం సమతుల్యంగా ఉంటుంది. అవేంటంటే…
న పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవాలి. సహజసిద్ధమైన పోషక విలువలు ఉండే పండ్లను తింటే శరీరాన్ని సమస్థితిలో ఉంచటమేగాక దాహార్తిని తీర్చి శరీరానికి స్వాంతననిస్తాయి.
న ఈ మధ్య పుచ్చకాయలు సీజన్‌తో సంబంధం లేకుండా అందుబాటులో ఉంటున్నాయి. రుచితో పాటు బి విటమిన్ అధికంగా ఉండే పుచ్చకాయ శరీరానికి శక్తినివ్వటమేగాక.. అందులో ఉండే పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. రక్తపోటును అరికడుతుంది.
న పోషక విలువలు ఎక్కువగా ఉండే కీరదోసను కూడా ఎక్కువగా తీసుకోవాలి.
న కొబ్బరిబొండాలకు వేసవిలో ఎక్కువ ప్రాధాన్యత నిస్తారు. కానీ ఏ కాలంలోనైనా వారంలో కనీసం ఒకసారైనా తీసుకోవడం వల్ల ఇందులోని ఖనిజ లవణాలు శరీరాన్ని చల్లబరుస్తాయి. దీంతో పాటు శరీరానికి తక్షణ శక్తి అందిస్తుంది.
న మజ్జిగ వేసవి కాలంలోనే కాదు, ఏ కాలంలోనైనా తీసుకోవచ్చు. పెరుగు స్థానంలో మజ్జిగ తీసుకుంటే శరీరానికి చాలా మంచిది.