వీటిని పాటిస్తే…

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని నియమాలు, పద్ధతులు అలవరుచుకోవాలి. మొక్కుబడిగా కాకుండా అదొక అలవాటుగా చేసుకుంటే మంచి ఆరోగ్యం సొంతమవుతుంది. ఈ అలవాట్లు చేసుకోవడం అవసరం కూడానూ.. అవేంటంటే…
సూర్యోదయానికి ముందే నిద్ర లేచేందుకు ప్రయత్నించాలి.
ఉదయం నిద్ర లేవగానే పరగడుపున రెండు లేదా మూడు గ్లాసుల గోరు వెచ్చటి మంచి నీటిని తాగాలి.
ప్రతిరోజు కనీసం పదిహేను నిమిషాల పాటు వ్యాయామం చేయండి.
వారానికి ఓ రోజు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించండి. ఉపవాసం ఉన్న రోజులో కేవలం నీటిని లేదా పండ్లను మాత్రమే తీసుకుంటే మంచిది.
టీ, కాఫీ వంటి వాటికి దూరంగా ఉండాలి.
తీసుకునే భోజనంలో పులుపు, మిర్చి, మసాలాలు, చక్కెర, వేపుడు పదార్థాలను సాధ్యమైనంత వరకు రాకుండా చూసుకోవాలి.
భోజనంలో సలాడ్‌లు, రుతువులననుసరించి పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి.
ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు వుండేలా చూసుకోవాలి.
మొలకెత్తిన గింజలు తరచూ తీసుకునేందుకు ప్రయత్నించాలి.
సమయానికి భోజనం చేయాలి, రాత్రి ఆలస్యంగా భోజనం చేయకూడదు.
ఉదయం, రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా పళ్లు తోముకోవాలి.
రాత్రి ఎక్కువసేపు మేలుకోవడం వల్ల ఆరోగ్యం పాడవ్వడమే కాకుండా ఉదయం ఆలస్యంగా నిద్రలేచే అవకాశాలు ఎక్కువ. పైగా మరుసటిన రోజు చేయాల్సిన పనులు ఆలస్యంగానే ప్రారంభమౌతాయి. దీని వల్ల రోజు వారీ షెడ్యూల్‌ కూడా గందరగోళం అవుతుంది.
మానసికంగా ఒత్తిడి పెరిగితే పలు జబ్బులకు ఆహ్వానం పలికినట్లౌతుంది. అందుకే ఒత్తిడిగా అనిపించినప్పుడు ఇష్టమైన సంగీతం లేదా పుస్తక పఠనం చేస్తే చాలా మంచిది.
ఈ అలవాట్లను క్రమం తప్పకుండా చేస్తే మంచి ఆరోగ్యం సొంతం అవుతుంది.

Spread the love