గర్భిణీలు పుట్టబోయే బిడ్డ, తల్లి ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవాలని మంగళవారం గర్భిణీలకు రామారెడ్డి పిహెచ్సి వైద్యులు సురేష్ సూచించారు. ఆస్పత్రిలో 30 మంది గర్భిణీలకు పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందు, తగు జాగ్రత్తలను సూచించారు. గర్భిణీలకు ఎలాంటి సమస్య ఉన్న వెంటనే వైద్యులకు, వైద్య సిబ్బందికి తెలియజేయాలని సూచించారు. వైద్య సిబ్బంది సమావేశము నిర్వహించి, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు కార్యక్రమంలో వైద్యులు చైతన్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.