నిర్లక్ష్యం చేయొద్దు

Don't neglectశరీరం, అలవాట్లు, దైనందిన చర్యల్లో మార్పులు వస్తున్నా గమనించుకో లేనంత బిజీ జీవితాలు మనవి. ముఖ్యంగా వర్కింగ్‌ ఉమన్‌… ఓ పక్క ఇంటిని చక్కదిద్దుకుంటూ, మరో పక్క ఉద్యోగాల కోసం పరుగులు తీసే క్రమంలో తమ ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. దాంతో కొన్ని ప్రమాదకర వ్యాధుల బారిన పడుతున్నారు. వాటిలో మూత్రాశయ క్యాన్సర్‌ ఒకటి. మూత్రం, మూత్ర విసర్జనా క్రమంలో వచ్చే మార్పులను గమనించుకోక పోవడం వల్ల మూత్రాశయ క్యాన్సర్‌ని ముందుగా గుర్తించలేకపోతున్నారు. తద్వారా ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఈ సమస్య వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అప్పుడు తప్పకుండా డాక్టర్‌ని సంప్రదించండి.

 మూత్ర విసర్జన సమయంలో నొప్పిగా ఉంటుంది. చురుక్కు చురుక్కు మనడంతో మొదలై నరాలు మెలిపెడుతున్నంత నొప్పి కలుగుతుంది.
మాటిమాటికీ మూత్రం వస్తున్నట్టు అనిపిస్తుంది. వెళ్తే చుక్కలు చుక్కలుగా చిన్న మొత్తంలో వచ్చి ఆగిపోతుంది.
మూత్రం ఎరుపు రంగులోకి మారుతుంటే పరీక్ష చేయించుకోవాల్సిందే. మూత్రంలో రక్తం పోతూ ఉన్నప్పుడే అలా రంగు మారవచ్చు.
తరచుగా యూరిన్‌ ఇన్ఫెక్షన్‌ బారిన పడుతుంటారు.
అరికాళ్లు, మడమల దగ్గర వాపు వస్తూ ఉంటుంది. అలా అని ప్రతి వాపూ క్యాన్సర్‌ లక్షణం కాదు. కొన్నిసార్లు వేరే కారణాల వల్ల నీరు చేరవచ్చు. అయితే వాపు వచ్చి ఓ పట్టాన తగ్గకపోతే మాత్రం ఆలోచించాల్సిందే.
కటి ప్రాంతంలో ఎముకలు, నరాలు నొప్పిగా అనిపిస్తాయి.
బరువు వేగంగా తగ్గిపోవడం కూడా సంభవిస్తుంది.
అయితే ప్రతి ఒక్కరిలో ఇవన్నీ కనిపించకపోవచ్చు. ఏ ఒక్క లక్షణం కనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్‌ దగ్గరకు వెళ్లాలి. నిజంగా వ్యాధి ఉంటే కనుక దాన్ని తొలి దశలోనే గుర్తిస్తే చికిత్సకు వీలుంటుంది. లేదంటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది.

అజీర్తికి కరివేపాకు…
కరివేపాకు అజీర్ణాన్ని అరికట్టి ఆకలిని పెంచుతుంది. జీర్ణాశయ సమస్యలను నియంత్రిస్తుంది.
విరేచనాలతో బాధ పడుతున్నట్ల యితే తప్పకుండా కరివే పాకును తీసుకోవాలి.
శరీరంలోని అనారోగ్య కరమైన కొవ్వును తగ్గిస్తుంది. కాబట్టి గుండెకు మేలు జరుగుతుంది. బరువు కూడా తగ్గొచ్చు.
ఇందులోని లాక్సేటివ్‌ లక్షణాలు మలబద్దకాన్ని నివారిస్తాయి.
కార్బోహైడ్రేట్స్‌, ఫైబర్‌, కాల్షియం, ఫాస్పరస్‌, ఇనుము, మెగ్నీషియం, రాగి, ఖనిజాలు కరివేపాకులో పుష్కలంగా ఉన్నాయి.
విటమిన్‌ సి,ఎ,బి,ఇ లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్‌, ప్లాస్టీ స్టెరాల్స్‌, అమైనో ఆమ్లాలు, గ్లైకోసైడ్లు, ఫ్లేవానాయిడ్స్‌ వంటి అనేక పోషకాలు ఉన్నాయి.
మధుమేహం, రక్తపోటు, రక్తహీనత వంటి సమస్యలను కరివేపాకు నియంత్రిస్తుంది.
పేగులు, పొట్ట కండాలను బలోపేతం చేయడంలో కరివేపాకు కీలకపాత్ర పోషిస్తుంది.
క్యాన్సర్‌ ప్రేరేపిత కారకాలను నియంత్రిస్తుంది. కాబట్టి.. కరివేపాకు రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటే క్యాన్సర్‌ భయం ఉండదు.

 

Spread the love