– సంక్షేమ సంబరాలను విజయవంతం చేయాలి
నవతెలంగాణ – నసురుల్లాబాద్
ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో దేశంలో ఎక్కడా లేనివిధంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తెలంగాణలో ఇంటింటికీ చేరుతున్నాయని నసురుల్లాబాద్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్ అన్నారు. మంగళవారం నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని బొమ్మన్ దేవ్ పల్లి చౌరస్తా లో ఉన్న శ్రీ వేంకటసాయి స్కూల్ లో 20న నిర్వహిస్తున్న సంక్షేమ సంబరాల స్థలంను పరిశీలించారు. అనంతరం నసురుల్లాబాద్ మండల కేంద్రంలో మాజీ ఎంపిటిసి పార్టీ గ్రామ అధ్యక్షుడు కంది మల్లేష్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ సంబరాల్లో పాల్గొనాలని కోరారు. సంక్షేమ పథకాలు లబ్ధిపొందుతున్న వారిని తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై అవగాహన కల్పిస్తున్నారు. సంక్షేమ సంబరాలను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరు సంక్షేమ లబ్ధిదారులందరూ హాజరు కావాలని కోరుతున్నారు. 2014 కన్న ముందు సంక్షేమ పథకాలు ఎలా ఉండే ప్రస్తుతం సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయనే దానిపై ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. సంక్షేమ అభివృద్ధిలో దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని, ప్రతి ఒక్కరు సంక్షేమ దినోత్సవం కార్యక్రమంలో విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మైషగౌడ్, బానుగౌడ్, నర్సింహులుగౌడ్, ఇమ్రాన్, రతన్, అంగన్ వాడి సిబ్బంది, ఆశ కార్యకర్తలు,